Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్.. ఆ ఫోటోను వాడొద్దంటూ..

రవితేజ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన చాలా సీన్స్, డైలాగ్స్, సాంగ్ బిట్స్ ఉన్నాయి. సినిమాలో అమితాబ్ బచ్చన్, రేఖరాల ఫోటోలను  ఉపయోగించుకుంది మూవీ టీమ్. అయితే ఈ పోస్టర్‌ను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు.. రేఖ చిత్రానికి బదులుగా అమితాబ్, జయా బచ్చన్‌ల ఫోటోను ఉపయోగించాలని సూచించింది.

Mr. Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్.. ఆ ఫోటోను వాడొద్దంటూ..
Mr Bachchan Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2024 | 9:33 AM

మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్స్ లో రవితేజ మిస్టర్ బచ్చన్ సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ రోజే సెన్సార్ వారు సినిమాకు పెద్ద షాక్ ఇచ్చారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సినిమా హీరోని పరిచయం చేశారు. కానీ సెన్సార్ బోర్డు మిస్టర్ బచ్చన్ లో కొన్నింటిని తొలగించి షాక్ ఇచ్చారు. అంతే కాదు సినిమాలోని చాలా సీన్స్‌కి కట్‌లు సూచించారు.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

రవితేజ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన చాలా సీన్స్, డైలాగ్స్, సాంగ్ బిట్స్ ఉన్నాయి. సినిమాలో అమితాబ్ బచ్చన్, రేఖరాల ఫోటోలను  ఉపయోగించుకుంది మూవీ టీమ్. అయితే ఈ పోస్టర్‌ను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు.. రేఖ చిత్రానికి బదులుగా అమితాబ్, జయా బచ్చన్‌ల ఫోటోను ఉపయోగించాలని సూచించింది. బచ్చన్, రేఖ మధ్య కొన్ని వివాదాలున్నాయి. వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అమితాబ్ బచ్చన్ కు నచ్చని వ్యక్తి  ఫోటో ఉండటం సరికాదు అని సెన్సార్ అధికారులు భావించారు. ఇప్పుడు అమితాబ్-రేఖ స్థానంలో అమితాబ్ జయా బచ్చన్‌ని ఫోటోను వాడారు బచ్చన్ టీమ్.

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

అలాగే ఇతర సన్నివేశాలను సెన్సార్ చేసి మ్యూట్ చేయాలని సూచింది. ‘మిస్టర్ బచ్చన్’ యాక్షన్ సన్నివేశం, సినిమాలో చాలా హింస ఉంటుంది. అనేక హింసాత్మక సన్నివేశాలకు బ్లర్ చేయాలని కూడా చెప్పింది . అలాగే సినిమాలో ఓ కుర్రాడు ఓ నిమిషం పాటు బీడీ తాగే సీన్ ఉందని, ఆ సీన్‌కి కూడా కట్‌ చెప్పాలని సెన్సార్‌ అధికారులు సూచించారు. కానీ బీడీకి బదులు పెన్సిల్ వాడేందుకు చిత్ర బృందం సెన్సార్ నుంచి అనుమతి పొందిందని అంటున్నారు. కొన్ని అసభ్యకర సంభాషణలను మ్యూట్ చేయాలని సూచించారు. వీటన్నింటికీ మించి సినిమాకు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్ అభిమాని. గతంలో రవితేజ, అమితాబ్ బచ్చన్ అభిమానిగా పాత్రలు పోషించారు. ప్రస్తుతం రవితేజ నటించిన  ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో ఇన్ కం టాక్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. చెడ్డవాళ్లపై దాడి చేసి అక్రమ సొమ్మును రాబట్టడమే అతని పని. సాలిడ్ యాక్షన్ మూవీ అయిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..