Ram Charan: రామ్ చరణ్ సినిమాలో నటించే ఛాన్స్.. ఎలా అప్లై చేయాలో తెలుసా ?..
మొదటి సారి చరణ్ ఇలాంటి జానర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తొలిసారి రాజకీయ నాయకుడిగా చరణ్ నటిస్తుండడంతో ఈ మూవీ చూసేందుకు అడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ విడుదల కాగా.. మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీస్ కోసం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా రాబోతుంది. మొదటి సారి చరణ్ ఇలాంటి జానర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తొలిసారి రాజకీయ నాయకుడిగా చరణ్ నటిస్తుండడంతో ఈ మూవీ చూసేందుకు అడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ విడుదల కాగా.. మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా.. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్… ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తి ఉన్నవారికి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆర్సీ 16 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ చిత్రయూనిట్ ప్రకటించింది. ఉత్తరాంధ్ర పల్లెటూరి యాసలో మాట్లాడగలిగే వారు వయసుల వారీగా తమ ప్రొఫైల్స్ ను పంపించాల్సిందిగా కోరారు. అడిషన్స్ కోసం మెయిల్ ఐడి, వాట్సాప్ నంబర్ షేర్ చేశారు. ఒక నిమిషం యాక్టింగ్ వీడియో.. అలాగే 3 ఫోటోస్.. కంటాక్ట్ డీటెల్స్ అన్నింటిని మెయిల్ లేదా వాట్సాప్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
Call for Audition… pic.twitter.com/S8HPRmMV1c
— BuchiBabuSana (@BuchiBabuSana) December 8, 2023
ఇంకా పట్టాలెక్కని ఈ సినిమాలో ఇప్పటికే ఛాన్స్ కొట్టేశాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటి. ఇటీవల బిగ్ బాస్ స్టేజ్ పైకి అతిథిగా వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు అర్జున్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పేశాడు. ఇప్పుడు కాస్టింగ్ కాల్ అనౌన్మెంట్ రావడంతో త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీపై మాత్రం ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
New Beginnings ❤️🤗 https://t.co/3mSV42DcWU
— BuchiBabuSana (@BuchiBabuSana) August 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.