Mohan Babu: మోహన్ బాబుపై కేసు నమోదు.. ఆస్పత్రిలో చేరిన నటుడు

మంచు ఫ్యామిలీ ఫైట్ నెక్స్ట్ లెవల్‌కి చేరింది. తండ్రికొడుకులు ఒకరిపై ఒకరూ కత్తులు దూసుకుంటున్నారు. గొడవ విషయంలో ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పరస్పర ఫిర్యాదులతో అలర్ట్ అయిన పోలీసులు యాక్షన్‌ షురూ చేశారు. ఈ సమయంలోనే మోహన్ బాబు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

Mohan Babu: మోహన్ బాబుపై కేసు నమోదు.. ఆస్పత్రిలో చేరిన నటుడు
Mohan Babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 11, 2024 | 7:55 AM

టీవీ9 ప్రతినిధిపై దాడి తర్వాత ఆస్పత్రిలో చేరారు మోహన్‌బాబు. మంగళవారం రాత్రి తోపులాటలో మోహన్‌బాబు గాయపడ్డారంటున్న ఆయన పీఆర్‌ టీమ్‌.. తలకు గాయమైనట్టు చెబుతున్నారు. రాత్రి నుంచి వైద్యుల పర్యవేక్షణలో మోహన్‌బాబుకి ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని.. ఇంకా వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు, మోహన్‌బాబు దాడిలో గాయపడిన టీవీ9 ప్రతినిధి తలకు మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్‌ అయ్యింది. టీవీ9 ప్రతినిధి రంజిత్‌కు కంటికి, చెవికి మధ్య మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. ఈ ఘటనలో మోహన్ బాబుపై BNS సెక్షన్‌ 118 (1) కేసు నమోదు చేశారు పోలీసులు. విధినిర్వహణలో ఉన్న రంజిత్‌పై మోహన్‌బాబు దాడిచేశారని.. ఉద్దేశపూర్వకంగా రంజిత్‌ మైకు, ఫోన్‌ లాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రిపోర్టర్‌ను దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ..  స్టీల్‌పైప్‌, మెటల్‌ లోగో ఉన్న మైకుతో భౌతికదాడికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. జల్‌పల్లి నివాసంలోని పరిస్థితిని వివరించడానికి.. మంచు మనోజ్‌ ఆహ్వానిస్తేనే రంజిత్‌ వెళ్లినట్లు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

జల్‌పల్లిలో క్షణక్షణం టెన్షన్‌..టెన్షన్‌ 

రోజుకో ట్విస్ట్, పూటకో సస్పెన్స్‌తో.. తెలుగు స్టేట్స్‌లో ట్రెండింగ్‌ మారింది హౌస్‌ ఆఫ్‌ మంచు వార్‌. పోటాపోటీ ఫిర్యాదులతో మొదలైన ఫైర్‌.. కాస్తా వైల్డ్‌ ఫైర్‌గా మారింది. మొన్నటి వరకూ నాలుగు గోడలకే పరిమితమైన ఫ్యామిలీ రగడ.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఎవరికి వారు తగ్గేదే లేదంటూ గొడవలకు దిగగడంతో పరిస్థితి… అదుపుతప్పింది.

పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉంటే.. మనోజ్‌కు సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఏంటని ఆయన భార్య మౌనిక ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా ఫిర్యాదు చేసినా మనోజ్‌కు భద్రత కల్పించకపోవడంపై ఆసహనం వ్యక్తం చేశారు. పోలీసులతో డైరెక్ట్‌గా ఫోన్‌లో మౌనిక వాగ్వాదానికి దిగారు. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికొస్తే ప్రైవేట్ కేసు వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు ఈవిషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు మౌనిక.

మోహన్‌బాబు సిబ్బంది విషయంలో మనోజ్ కలగచేసుకోవడంతోనే ఈగొడవ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. తన సిబ్బందిని మనోజ్ తిట్టడంతో మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు ప్రత్యక్షసాక్షులు. ఇప్పటికిప్పుడు వచ్చిన గొడవలు కాదని.. గతంలో గొడవలకు ఇప్పుడు జరిగిన రగడ ఆజ్యం పోసిందని చెప్తున్నారు మోహన్‌బాబు ఇంట్లో పనిచేస్తు్న్న వ్యక్తులు.

పరస్పరం కేసులు.. దాడులతో అప్రమత్తమైన పోలీస్‌ ఉన్నతాధికారులు.. అలర్ట్ అయ్యారు. మోహన్‌బాబు, విష్ణు గన్‌లను సీజ్‌ చేయాంటూ ఆదేశించారు. తక్షణం గన్‌లు స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం10:30 గంటలకు విచారణకు హాజరుకావాలని..నోటీసుల్లో పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.