AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Bharath: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే.. ఫోటోస్ వైరల్..

చిట్టి నాయుడి పాత్రలో అద్భుతమైన నటనతో అలరించాడు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన భరత్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లపాటు చదువుల దృష్ట్యా సినిమాలకు దూరమైన భరత్.. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాతో సెకండ్ హీరోగా నటించి మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమాతో మెప్పించాడు.

Actor Bharath: చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ గుర్తున్నాడా.. ? ఇప్పుడేం చేస్తున్నాడంటే.. ఫోటోస్ వైరల్..
Actor Bharath
Rajitha Chanti
|

Updated on: May 25, 2024 | 9:59 AM

Share

చైల్డ్ ఆర్టిస్ట్ భరత్.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే బాలనటుడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పెదబాబు, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, హ్యాపీ, పోకిరి, అందాల రాముడి.. దుబాయ్ శీను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‏తో కడుపుబ్బా నవ్వించాడు. దాదాపు 80కి పైగా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మాస్టర్ భరత్ టాలీవుడ్ అడియన్స్ కు సుపరిచితమే. చిట్టి నాయుడి పాత్రలో అద్భుతమైన నటనతో అలరించాడు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించిన భరత్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లపాటు చదువుల దృష్ట్యా సినిమాలకు దూరమైన భరత్.. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాతో సెకండ్ హీరోగా నటించి మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమాతో మెప్పించాడు. అయితే ఇప్పుడు భరత్ పేరు అసలు వినిపించడమే లేదు.

చిన్నవయసులోనే అద్భుతమైన నటన.. కామెడీ టైమింగ్‍తో వెండితెరపై సందడి చేసిన భరత్.. పెద్దవాడయ్యాక అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న భరత్.. ఆ తర్వాత హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు. చిన్నప్పుడు బొద్దుగా ఉండే భరత్.. ఇప్పుడు కసరత్తులు చేసి సిక్స్ పాక్ బాడీతో యంగ్ హీరోలకు పోటీగా రెడీ అయ్యాడు. ఏబీసీడీ సినిమాలోనే కాకుండా దూసుకెళ్తా, ఆచారి అమెరికా యాత్ర, ఇద్దరి లోకం ఒక్కటే వంటి చిత్రాల్లో నటించాడు. చివరగా అల్లు శిరీష్ సినిమాలో కనిపించిన భరత్.. ఆ తర్వాత మరో మూవీలో కనిపించలేదు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న భరత్ సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యాడు. చాలా కాలంగా అతడి ఇన్ స్టాలో ఎలాంటి పోస్టులు చేయడం లేదు.ప్రస్తుతం భరత్ లేటేస్ట్ ఫోటోస్ మాత్రం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మూడేళ్ల వయసు నుంచి సినిమాల్లో నటిస్తున్న భరత్ ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే కాలేజీ సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో భరత్ కన్నుకు పెద్ద గాయమే అయ్యిందట. దీంతో తన కన్ను ఒకటి పనిచేయదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చాలాకాలం పాటు కళ్లకు గ్లాసెస్ పెట్టుకుని ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం భరత్ కు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

View this post on Instagram

A post shared by Bharathkumar BKR (@iam_bkh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.