Tollywood: స్కూల్లో టాప్ ర్యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో గ్లామర్ క్వీన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?
ముఖ్యంగా ఆ అమ్మాయికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమనుకున్నారు. కానీ టాలెంట్ ఎంత ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు రావడం లేదు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ పేపర్ లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అందరూ మల్టీటాలెంటెడ్. ఇప్పుడు అద్భుతమైన నటనతో మెప్పిస్తున్న తారలలో మరో టాలెంట్ దాగి ఉంది. శ్రీలీల, సాయి పల్లవి ఓవైపు డాక్టర్ చదువు కొనసాగిస్తూనే మరోవైపు నటీమణులుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. అలాగే మరికొందరు హీరోయిన్స్ కొన్ని క్రీడలలో నేషనల్ ఛాంపియన్స్. కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మాత్రం ఇండస్ట్రీలో చాలా స్పెషల్. స్కూల్లో వన్ ఆఫ్ ది టాపర్. అప్పట్లో చదువుల్లో మంచి మార్కులు సంపాదించింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోనూ అందం, అభినయం పరంగా మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ అమ్మాయికి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావడం ఖాయమనుకున్నారు. కానీ టాలెంట్ ఎంత ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం అవకాశాలు రావడం లేదు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ పేపర్ లో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టగలరా ..? తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీని మాత్రం మేకర్స్ అంతగా పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అనుకుంటున్నారా ..? తనే హీరోయిన్ సంయుక్త మీనన్.
అందమైన క్షణాలను మిస్ అవుతున్నాను అంటూ స్కూల్ డేస్ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. పాఠశాలలో రోజుల్లో సంయుక్త టాపర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన సంయుక్త..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో సెకండ్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సంయుక్త కనిపించింది తక్కువ సమయమే అయినా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ బ్యూటీకి యూత్ లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష, ధనుష్ జోడిగా సార్ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది.
వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న సంయుక్తకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు కెరీర్ మాత్రం ఇప్పుడు సైలెంట్ అయ్యింది. చివరగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో కనిపించింది సంయుక్త. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా కోసం సంయుక్త స్వయంగా హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




