
హీరో వెంకటేష్ సినిమాల గురించి ఆయనకు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.. ఇప్పటికీ మెప్పిస్తున్నారు వెంకటేష్. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించారు వెంకటేష్. యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. సినిమాలతో పాటు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఇక వెంకటేష్ ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వెంకటేష్‌కు సంబందించిన ఓ ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా వెంకటేష్‌తో పాటు ఆ ఫొటోలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు.
పైన కనిపిస్తున్న ఫోటో చూశారా..? వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో అది. ఆ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు గుర్తుపట్టారా..? అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయారు ఆ ఇద్దరు. ఒకరేమో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.. మరొకరు టాప్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కనిపెట్టరా..? ఆ ఇద్దరూ వెంకటేష్‌తో కలిసి పని చేశారు కూడా.? ఇప్పటికైనా కనిపెట్టారా.?
వెంకటేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు వెంకీ. ఇప్పుడే కాదు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాగే ఆ నటించిన సినిమాలకు పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా మారారు. అలాగే ఆయనతో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్‌గానూ మారిపోయారు. కాగా పై ఫొటోలో నవ్వుతు ఉన్న పిల్లడు హీరో రామ్ పోతినేని.. అలాగే రెండో బాణం గుర్తు చూపిస్తున్న వ్యక్తి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ తో కలిసి వెంకటేష్ మసాలా అనే సినిమా చేశారు. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలు రాశారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.