Tollywood: సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న డైరెక్టర్.. ఒక్క సినిమాతో1000 కోట్లు కలెక్షన్స్.. ఎవరంటే..

|

Nov 19, 2024 | 7:16 AM

ఈ ఫోటోలోని చిన్నోడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. అలాగే సినీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు. బాలీవుడ్ హీరోలు అతడితో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న డైరెక్టర్.. ఒక్క సినిమాతో1000 కోట్లు కలెక్షన్స్.. ఎవరంటే..
Actor
Follow us on

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ సత్తా చాటుతున్న సంగతి తెలిసింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు, తమిళం, కన్నడలో తెరకెక్కించిన మూవీస్ నార్ ఇండస్ట్రీలోనూ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఇప్పుడు సౌత్ డైరెక్టర్లవైపు చూస్తోంది యావత్ ఇండియా. బాలీవుడ్ స్టార్స్ సైతం దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు మార్గదర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ గర్వించదగిన దర్శకుడిగా మారాడు. వరుసగా నాలుగు హిట్స్ కొట్టి సెన్సెషన్ అయ్యాడు. అతడు మరెవరో కాదండి.. డైరెక్టర్ అట్లీ.

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఫమక్తకం అనే షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించడం ద్వారా ఫేమస్ అయ్యాడు అట్లీ. అంతకు ముందు దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన 2013లో విడుదలైన రాజారాణి సినిమా ద్వారా దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత విజయ్ దళపతి, సమంత జంటగా అట్లీ రూపొందించిన తేరి జాక్ పాట్ కొట్టింది.

ఇవి కూడా చదవండి

తమిళంలో వరుస సినిమాలను రూపొందిస్తూ అతి తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ అయ్యాడు. రాజారాణి, తేరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. తమిళంలో వరుసగా నాలుగు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీ ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాను తెరకెక్కించాడు. నయనతార, విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు.. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. వరుస ప్లాపులతో అల్లాడిపోతున్న షారుఖ్ కు మంచి కమర్షియల్ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు అట్లీ. అతడితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.