
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఓ చిన్నారి.. ఇప్పుడు మలయాళీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్. ఆమె కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. నిత్యం విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ నటి మలయాళంలో అత్యంత ప్రామిసింగ్ తారలలో ఒకరు. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ? ఇటీవలే ఆమె యాక్టింగ్ పై నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి సైతం ప్రశంసలు కురిపించారు. ఆమె యాక్టింగ్ చూసి తాను ఆశ్చర్యపోయానని.. అద్భుతమైన నటన అని అన్నారు. ఆమె మరెవరో కాదు.. అనస్వర రాజన్. ఈపేరు సోషల్ మీడియా చాలా పాపులర్.
తాను చేసే ప్రతి కొత్త సినిమాతో తనలోని నటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే ‘ఉదహరణం సుజాత’ అనే మలయాళీ చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత ఎక్కువగా పాఠశాల, కళాశాల పాత్రలను పోషించింది. ‘తన్నీర్మతన్ దినంగల్’ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈదే, ఆద్య రాత్రి, సూపర్ శరణ్య, మైక్ వంటి సినిమాలతో జనాలకు దగ్గరయ్యింది. నిఖిల్ మురళి దర్శకత్వం వహించిన ప్రణయ విలాసం సినిమాతో ఆమెకు స్టార్ డమ్ వచ్చింది.
అలాగే మోహన్ లాల్-జీతు జోసెఫ్ చిత్రం నీరు, జయరామ్-మమ్మూట్టి-మిథున్ మాన్యుయెల్ ఓస్లర్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఇటీవలే పింకిలి, రేఖచిత్రం అనే రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. రేఖచిత్రంలో మమ్ముట్టి సోదరడిని ప్రేమించే రేఖ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది అనస్వర రాజన్. ఇక ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ బంధుమిత్రడికల్.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..