Tollywood: ఈ గోపికను గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఆ పెద్దింటికి కోడలిగా..

|

Dec 03, 2024 | 5:17 PM

ఈ ఫొటోలోని పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. పక్కా తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఈ గోపికను గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఆ పెద్దింటికి కోడలిగా..
Tollywood Actress
Follow us on

సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల ప్రాతినిథ్యం తక్కువ. పేరుకు టాలీవుడ్ అయినా ఇక్కడ కూడా మన తెలుగు హీరోయిన్స్ కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే కోలీవుడ్, బాలీవుడ్ బాట పట్టి అక్కడ సత్తా చాటుతున్నారు. పై ఫొటోలో ఉన్న గోపిక కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. పేరుకు పక్కా తెలుగు అమ్మాయి అయినప్పటికీ దక్షిణాదిలోనే ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది. మాజీ మిస్ ఇండియా అయిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అడపాదడపా తెలుగులోనూ సినిమాలు చేసింది. అయితే ఇప్పుడీ అందాల తార టాలీవుడ్ లో ఓ పెద్దింటికి కోడలిగా వెళ్లనుంది. ఆ కుటుంబానికి చెందిన ఒక స్టార్ హీరోతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే పెళ్లి కూతురిగా ముస్తాబైన ఈ ముద్దుగుమ్మ ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. యస్.. ఈ చిన్నారి గోపిక మరెవరో కాదు శోభిత ధూళిపాళ్ల. బుధవారం (డిసెంబర్ 04) అక్కినేని అందగాడు నాగ చైతన్యతో ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో శోభితకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఏపీలో పుట్టి పెరిగిన శోభిత 2013 మిస్ ఇండియాగా నిలిచింది. 2016లో సినిమాల్లోకి అడుగు పెట్టింది. రామన్ రాఘవ్, చెఫ్, కళాకండి అనే హిందీ సినిమాలతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో గూఢచారి, మేజర్ సినిమాలు చేసిం. ఇక పొన్నియన్ సెల్వం శోభితకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే హిందీలో ఆమె నటించిన మేడిన్ హెవెన్, బర్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ వంటి వెబ్ సిరీస్ లు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి కూతురిగా ముస్తాబైన శోభిత..

కాగా గత కొంత కాలంగా నాగ చైతన్యతో ప్రేమలో ఉంది శోభిత. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్నిమూడు ముళ్ల బంధంగా మార్చుకోనున్నారీ లవ్ బర్డ్స్. బుధవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ చైతన్య, శోభితల వివాహం జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు
పలువురు సినీ ప్రముఖుల ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారు.

ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో శోభిత ధూళిపాళ్ల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.