AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో స్టైలీష్‏గా కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? అచ్చమైన తెలుగుమ్మాయి..

అతి తక్కువ సమయంలోనే కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. వరుసగా హిట్స్ సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇటీవలే సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood: ఈ ఫోటోలో స్టైలీష్‏గా కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? అచ్చమైన తెలుగుమ్మాయి..
Colours Swathi
Rajitha Chanti
|

Updated on: Sep 17, 2024 | 1:12 PM

Share

సాధారణంగా సినీరంగంలో తెలుగమ్మాయిలకు అంతగా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు. ఇది చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ఇది.. కానీ కొన్నాళ్ల క్రితమే ఆ మాటలను బ్రేక్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది ఈ అమ్మాయి. అతి తక్కువ సమయంలోనే కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. వరుసగా హిట్స్ సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇటీవలే సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కలర్స్ స్వాతి.

పైన ఫోటోలో తల్లిదండ్రుల మధ్యలో స్టైలీష్ గా కూర్చున్న ఆ అమ్మాయి స్వాతి రెడ్డి. ఇలా చెబితే మీరు అస్సలు గుర్తుపట్టలేరు. కానీ కలర్స్ స్వాతి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. తండ్రి నేవీ అధికారి కావడంతో కొన్నాళ్లపాటు రష్యాలో సెటిల్ అయ్యారు. అయితే తన తండ్రి రష్యాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే స్వాతి జన్మించింది. చిన్నతనంలో తొలుత ముంబయిలో ఉన్న స్వాతి కుటుంబం ఆ తర్వాత విశాఖపట్నం షిఫ్ట్ అయ్యారు. ఇక చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన స్వాతి టీనేజ్ లో ఉండగానే ‘కలర్స్’ అనే ప్రోగ్రాంలో యాంకర్ గా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలను ఇంటర్వ్యూ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యింది.

అప్పటి నుంచి కలర్స్ స్వాతిగా క్రేజ్ సంపాదించుకుంది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత వెంకీ, త్రిష కాంబోలో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులో సినిమాలో త్రిష చెల్లిగా కనిపించింది. తెలుగులో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న స్వాతి.. తమిళంలో మాత్రం సుబ్రహ్మణ్యపురం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన అష్టాచెమ్మా సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న స్వాతి.. తర్వాత స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో మరిన్ని హిట్స్ అందుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్వాతి.. గతేడాది పంచతంత్రం సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకులను అలరించింది. సాయి దుర్గ తేజ్ తో కలిసి సత్య అనే షార్ట్ ఫిల్మ్ చేసింది.

Colours Swathi New

Colours Swathi New

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us