AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 వేల EMIతో 30 లక్షల ఇల్లు కొనుక్కోవడం ఎలా.? ఇది తెలియక చాలామంది..

తక్కువ జీతంతో సొంత ఇల్లు కొనడం సాధ్యమేనా? అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కేవలం రూ. 10,000 ఈఎంఐతో రూ. 30 లక్షల ఇంటిని సొంతం చేసుకునే అద్భుతమైన ఆప్షన్ వివరించారు. బ్యాంక్ లోన్లు, సబ్సిడీలు, స్మార్ట్ రీపేమెంట్ పద్ధతుల ద్వారా మీ ఇంటి కలను ఎలా నిజం చేసుకోవాలో ఈ కథనంలో చూడండి.

10 వేల EMIతో 30 లక్షల ఇల్లు కొనుక్కోవడం ఎలా.? ఇది తెలియక చాలామంది..
House Loan
Ravi Kiran
|

Updated on: May 07, 2026 | 7:38 AM

Share

మనం సాధారణంగా రూ. 30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే, నెలకు కనీసం రూ. 25,000 నుంచి రూ. 30,000 ఈఎంఐ కట్టాల్సి ఉంటుందని భయపడతాం. కానీ, సరైన ప్లానింగ్ ఉంటే కేవలం రూ. 10,000 ఈఎంఐతో కూడా ఈ ఇంటిని సొంతం చేసుకోవచ్చని బిజినెస్ నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ ప్లాన్‌లో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి. మొదటిది, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY) సబ్సిడీ.

అర్హత ఉన్న వారికి ప్రభుత్వం నుంచి దాదాపు రూ. 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. దీనివల్ల మీ లోన్ అసలు మొత్తం గణనీయంగా తగ్గుతుంది. రెండోది, లోన్ గడువు. లోన్ కాలాన్ని 30 ఏళ్ల వరకు పెంచుకోవడం ద్వారా నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. ఆరంభంలో తక్కువ ఈఎంఐతో మొదలుపెట్టి, ఆదాయం పెరిగే కొద్దీ లోన్‌ను త్వరగా క్లియర్ చేసే ఆప్షన్లు ఎంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అపార్ట్‌మెంట్లు కాకుండా కాస్త సిటీకి దూరంగా ఉన్న వెంచర్లలో లేదా తక్కువ ధరకు వచ్చే ప్లాట్లలో ఇల్లు నిర్మించుకోవడం. దీనివల్ల ప్రాపర్టీ విలువ భవిష్యత్తులో పెరగడమే కాకుండా, తక్కువ పెట్టుబడితో ఇల్లు పూర్తవుతుంది.

అలాగే, ఉమ్మడి ఆదాయం(భార్యాభర్తలు ఇద్దరూ కలిపి) చూపించడం ద్వారా లోన్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కేవలం ఈఎంఐ కట్టడమే కాకుండా, మీరు కట్టే ఈఎంఐలో కనీసం 10-15 శాతం మొత్తాన్ని ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. 15-20 ఏళ్ల తర్వాత ఆ ఎస్ఐపీ ద్వారా వచ్చే రాబడితో మీ మిగిలిన లోన్ మొత్తాన్ని ఒక్కసారిగా తీర్చివేయవచ్చు. అంటే, మీరు కట్టే ఈఎంఐ మీకు భారం కాకుండా, ఒక పద్ధతి ప్రకారం మీ ఆస్తిని మీకు దక్కేలా చేస్తుంది. సొంతింటి కల నిజం చేసుకోవడానికి భారీ ఆదాయం కంటే, పక్కా ప్రణాళిక ముఖ్యమని బిజినెస్ నిపుణులు అంటున్నారు.

Follow Us