Tollywood: అద్దానికే చెమటలు పట్టించేస్తోన్న వయ్యారి.. కిల్లర్ చూపుల హీరోయిన్.. ఎవరో తెలుసా..

తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ సుందరి. అందం, అమాయకత్వం కలబోసినట్లుగా కనిపిస్తూ నెటిజన్లను మాయ చేస్తుంది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది. అందం, టాలెంట్ ఎంత ఉన్న అదృష్టమే కలిసిరాలేదు.

Tollywood: అద్దానికే చెమటలు పట్టించేస్తోన్న వయ్యారి.. కిల్లర్ చూపుల హీరోయిన్.. ఎవరో తెలుసా..
Actress
Follow us

|

Updated on: Jun 25, 2024 | 8:14 AM

సోషల్ మీడియాలో చాలా రోజులుగా త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్స్ షేర్ చేసే సరికొత్త ఫోటోస్ కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వరుసగా ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేసే పలువురు ముద్దుగుమ్మలు ఇప్పుడు ఫేస్ హైడ్ ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక తమ అభిమాన హీరోయిన్స్ ఫేస్ హైడ్ ఫోటోస్ షేర్ చేస్తూ ఎవరో గుర్తుపట్టండి అంటూ నెటిజన్లకు ఛాలెంజ్ విసురుతున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫోటో కూడా అలాంటిదే. వయ్యారాలతో అద్దానికే చెమలు పట్టిస్తోన్న ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ సుందరి. అందం, అమాయకత్వం కలబోసినట్లుగా కనిపిస్తూ నెటిజన్లను మాయ చేస్తుంది. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది. అందం, టాలెంట్ ఎంత ఉన్న అదృష్టమే కలిసిరాలేదు. తెలుగులో ఆడపాదడపా సినిమాలు చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా..? తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే.

విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హీరోగా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాతోనే రౌడీ హీరోగా అభిమానులకు దగ్గరయ్యాడు విజయ్. ఇక ఇదే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అభినయంతోపాటు అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తనదైన నటనటో అభిమానులను ఫిదా చేసింది ఈ బ్యూటీ.

అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో మెరిసింది. కానీ ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించని ఈ బ్యూటీ అటు హిందీలో ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ తనయుడు నటిస్తోన్న మహారాజ్ సినిమాలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో నెట్టింట హీటెక్కిస్తోంది షాలిని.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.