Brahmastram: టీవీల్లోకి వచ్చేస్తోన్న ‘బ్రహ్మాస్త్రం’.. ఎప్పుడు ప్రసారం కానుందంటే..
అలియా భట్, నాగార్జున, అమితాబచ్చన్, మౌని రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బ్రహ్మాస్త్రం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇందులో అలియా భట్, నాగార్జున, అమితాబచ్చన్, మౌని రాయ్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
త్వరలో స్టార్ మా లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి తనుజ్ టికు, ప్రితమ్ లు సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను కూడా రాబట్టింది.




బ్రహ్మస్త్ర పార్ట్ 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆల్రెడీ కథా కథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే సీక్వెల్‌లో లీడ్ క్యారెక్టర్‌లో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్. ఈ రోల్‌లో ఓ టాప్ స్టార్‌ను ఎంపిక చేయాలని చూస్తున్నారట.