AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana: అనారోగ్యం బారిన పడిన బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా.. ఆందోళనలో ఫ్యాన్స్‌

ఆ మధ్యన రామ్‌ గోపాల్‌ వర్మతో అరియానా చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక టీవీ షోలతో బిజీగా ఉండే  ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్‌లను ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటుంది.

Ariyana: అనారోగ్యం బారిన పడిన బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా.. ఆందోళనలో ఫ్యాన్స్‌
Ariyana Glory
Basha Shek
|

Updated on: May 12, 2023 | 5:54 AM

Share

బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరీర్‌ ప్రారంభంలో యూట్యూబ్‌లో వీడియోలు చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక టీవీ షోల్లో అవినాష్‌తో చేసిన స్కిట్లు బుల్లితెరపై బాగా హిట్‌ అయ్యాయి. ఇటీవలే బిగ్‌బాస్‌ (బీబీ) జోడీలో రన్నరప్‌గా కూడా నిలిచిందీ జోడీ. ఆ మధ్యన రామ్‌ గోపాల్‌ వర్మతో అరియానా చేసిన బోల్డ్‌ ఇంటర్వ్యూ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక టీవీ షోలతో బిజీగా ఉండే  ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోస్‌లను ఎప్పటికప్పుడూ షేర్‌ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా అరియానా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. అరియానా త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

‘చాలా రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా’ అని వీడియోలో చెప్పుకొచ్చింది అరియానా. కాగా ఈ వీడియోలో అరియానా చేతికి సిరంజి స్టిక్కర్‌ ఉండడంతో ఫ్యాన్స్‌ను కలవరపరుస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే బీబీ జోడీలో అవినాష్‌తో కలిసి పాల్గొన్న అరియానా తన డ్యాన్సింగ్‌తో ఆకట్టుకుంది. ఈ షోలో అరియానా జోడీ ఫైనల్ కి వెళ్లింది. ఆఖరి పోరులో అరియనా జోడి ఫైమా,సూర్య జోడీ చేతిలో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..