
లేటెస్ట్ సెన్సేషన్ , లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి వరుస విజయాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది సాయి పల్లవి. అమరన్ సినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది. తాజాగా తండేల్ సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా అందమైన ప్రేమకథ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తండేల్ సినిమా తర్వాత సాయి పల్లవికి మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.
తండేల్ సినిమాలో సాయి పల్లవి తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సాయి పల్లవి నటనతో పాటు నాగ చైతన్య కూడా నటనతో ఆకట్టుకున్నాడు. తండేల్ సినిమాలో సక్సెస్ లో దేవీ శ్రీ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. తండేల్ సినిమాలోని పాటలన్ని ప్రేక్షకులను మెప్పించాయి. సాయి పల్లవి డాన్స్ పై కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. తండేల్ సినిమాలో హైలెస్సో హైలాస్సా పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు చాలా మంది డాన్స్ చేస్తూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హైలెస్సో హైలాస్సా పాట రీల్స్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అయితే ఈ పాట పై ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా హైలెస్సో హైలాస్సా సాంగ్ థియేటర్స్ లో ప్లే అవుతుంటే కొంతమంది యువకులు వెటకారంగా డాన్స్ లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై సాయి పల్లవి రియాక్ట్ అయినట్టు కొంతమంది ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. బాయ్స్ వెటకారంగా డాన్స్ చేస్తుంటే ఎవర్రా మీరంతా.. అంటూ ఫన్నీగా మీమ్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి