ప్రభాస్ స్పిరిట్ మూవీలో ఛాన్స్ కోసం అప్లై చేసిన హీరో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మంటలెక్కుతుందిగా .. మొన్నటు వరకు ఏడాదికి ఒక్క సినిమా చేసిన ప్రభాస్.. ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయనున్నాడు. అదుపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన సందీప్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత హిందీలోకి అడుగుపెట్టాడు. అక్కడ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.
ఇక యానిమల్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమా భారీ హిట్ తో పాటు కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమా హిందీలో రూ. 900కోట్లకు పైగా వసూల్ చేసి నయరికార్డ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పిరిట్ పనుల్లో బిజీగా మారాడు. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా స్పిరిట్ చిత్రయూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
స్పిరిట్ సినిమాలో నటించే నటీ నటుల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్ని వయసుల పురుషులు, మహిళలు… సినిమా, నాటకరంగ నేపథ్యం ఉన్నవారు కావలెను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీని పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు స్పందించారు . యో… నేను కూడా ఈ సినిమాకు అప్లై చేశాను… ఏం జరుగుతుందో చూడాలి అని విష్ణు ట్వీట్ చేశారు. అని విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈపోస్ట్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా విష్ణు హీరోగా కన్నప్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ చిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు.
Yo! I applied. Now let’s wait and see 💪🏽🥰 https://t.co/PXNOPrl5aS
— Vishnu Manchu (@iVishnuManchu) February 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




