AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టాలీవుడ్‌లో అమ్మాయిల ఫేవరెట్ హీరో.. ఇప్పుడు విలన్ గా..

సినిమా సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటారు. పుట్టిన రోజు వేడుకలు లేదా ప్రత్యేక సందర్భాల్లో తమ త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. అలా ఓ ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పుడు హ్యాండ్సమ్ విలన్‌ గా అదరగొడుతోన్న ఓ నటుడు తన చిన్ననాటి ఫొటోలను పంచుకున్నాడు.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టాలీవుడ్‌లో అమ్మాయిల ఫేవరెట్ హీరో.. ఇప్పుడు విలన్ గా..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Feb 15, 2025 | 4:39 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ చిన్నబాబు ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. తన నటనతో అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశాడు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ప్రధానంగా లవ్ స్టోరీలు, కామెడీ సినిమాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరేట్ హీరో అయిపోయాడు. ఇక మధ్యలో వయసు ప్రభావంతో పాటు వరుస పరాజయాలతో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా సెకెండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ సత్తా చాటుతున్నారు. విలన్ గా నూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంటోన్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. తీరిక లేని షూటింగులతో నిత్య బిజి బిజీగ ఉండే ఈ యాక్టర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. . తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంటారు. అలా తాజాగా తన చిన్నప్పటి ఫొటోలతో చేసిన ఓ అందమైన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. మరి ఆ నటుడెవరో గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు జగ్గూ భాయ్ అలియాస్ జగపతి బాబు.

కాగా 63 ఏళ్ల జగపతి బాబు తీరిక లేని షూటింగులతో బిజి బిజీగా గడుపుతున్నారు. గతేడాది ఆయన నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయంటే జగ్గూ భాయ్ క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు జగపతి బాబు. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాగే తన జిమ్, వర్కవుట్ ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

జగపతి బాబు షేర్ చేసిన వీడియో..

జగపతి బాబు ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

 రామ్ చరణ్ సినిమా సెట్ లో జగపతి బాబు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు