TOP 9 ET News: కాదని తెలిసినా ఆగని రచ్చ | దేవుడు వరమిచ్చినా వద్దనడం అంటే ఇదేనేమో
దేవుడు వరమిస్తే ఎవరైనా వద్దంటారా? అనరు కదా..! కానీ ఫ్యాన్స్ దృష్టిలో దేవుడు లాంటి ప్రభాస్ వరమిచ్చాక కూడా విష్ణు ఇలా చేయడం ఏంటని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట పెదవి విరుస్తున్నారు. ప్రభాస్ కన్నప్ప సినిమా చేస్తానని చెప్పాక.. లార్డ్ శివుడి క్యారెక్టర్ ఇవ్వాలి కానీ.. నందీశ్వరుడి క్యారెక్టర్ ను మా హీరోకు ఇవ్వడం ఏంటని విష్ణును ప్రశ్నిస్తున్నారు.
ఇన్నాళ్లూ శివుడిగా ప్రభాస్‌ను ఊహించుకున్నాక.. ఇప్పుడు నందీశ్వరుడిగా.. ప్రభాస్ ఊహించుకోలేకపోతున్నాం అంటూ మళ్లీ నెట్టింట రెస్పాండ్ అవ్వడం మొదలెట్టారు. ఈ మూవీ నుంచి శివ శివ శంకర సాంగ్ ట్రెండ్ అవుతున్న క్రమంలో మళ్లీ తమ గళాన్ని కొత్తగా వినిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కింగ్ డమ్. యంగ్ టైగర్ వాయిస్ ఓవర్‌తో.. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దాంతో పాటే నెట్టింట ఓ చిన్న పాటి రచ్చను షురూ చేసింది. దాంతో పాటే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించాల్సింది కదా.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడే అనే కామన్ కామెంట్ కూడా కొంత మంది నెటిజన్స్ నుంచి రావడం షురూ అయింది. అయితే ఇదే విషయంపై ఎప్పుడో ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమాతో చేస్తున్న కింగ్‌డమ్ సినిమా కథ వేరు… చరణ్‌తో గౌతమ్ చేయాలనుకున్న సినిమా కథ వేరంటూ ఓ మీడియా మీట్లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలిసినా కూడా.. ఇప్పుడు నెట్టింట కింగ్ డమ్ మూవీ గురించి రచ్చ ఆగడం లేదు. రామ్ చరణ్ ఈ సినిమా చేయాల్సిందన్న టాక్ తగ్గడం లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brahma Anandam: బ్రహ్మానందం మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్టా ?? ఫట్టా ??
విశ్వక్‌సేన్ లైలా సినిమా హిట్టా? ఫట్టా? తెలియాలంటే ఈ వీడియో చూసేయండి
పసి పిల్లాడని కూడా చూడకుండా ఆటలా.. బుల్లి రాజు చేసిన తప్పేంటి ??
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

