Year Ender 2024: ఈ ఏడాది రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా ఇదే.. ఆ మూవీని ఎక్కువ మంది చూశారట..

|

Dec 21, 2024 | 11:31 AM

ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం మొత్తం ఓ సినిమాను ఎక్కువ మంది చూశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

Year Ender 2024: ఈ ఏడాది రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా ఇదే.. ఆ మూవీని ఎక్కువ మంది చూశారట..
Stree 2, Pushpa 2
Follow us on

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స సృష్టిస్తోంది పుష్ప 2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా మరో ఘనత సాధించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా బుక్ మై షో ప్రకారం 2024లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ పోటీ నెలకొంది. అయితే ఈ ఏడాది చివరలో విడుదలైన పుష్ప 2 మాత్రం అన్ని చిత్రాలను వెనక్కు నెట్టేసింది. ఇదిలా ఉంటే.. 2024 ముగియడానికి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. మరో రెండు వారాల్లో నూతన సంవత్సరం రానుంది.

తాజాగా బుక్ మై షో #BookMyShowThrowback పేరుతో ఇయర్ ఎండ్ రిపోర్టును రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప 2 ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా అని బుక్ మై షో అనౌన్స్ చేసింది. అంతకు ముందు ఈ రికార్డ్ స్త్రీ 2 పేరు మీద ఉండేది. బాలీవుడ్ లో విడుదలై రికార్డ్స్ తిరగరాసిన ఈ సినిమాను ఇప్పుడు పుష్ప 2 వెనక్కు నెట్టింది. బుక్ మై షో రిపోర్ట్ ప్రకారం.. పుష్ప 2 మూవీకి 10.8 లక్షల సోలో వ్యూస్ వచ్చినట్లు తెలిపింది. అంతకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. అలాగే ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడైన సినిమాగా రికార్డ్ సాధించింది.

నవంబర్ 1న రికార్డ్ స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ టికెట్స్ అమ్ముడైనట్లు వెల్లడించింది. సినిమాలే కాదు.. ఈ ఏడాది లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది మొత్తం 319 నగరాల్లో జరిగిన 30,687 లైవ్ ఈవె్టల టికెట్లను బుక్ మై షో అందుబాటులో ఇంచింది. ఈ ఏడాది వీటి కొనుగోలు 18 శాతం మేర పెరిగిందట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.