Emergency Movie: కంగనాకు బాంబే హైకోర్ట్ షాక్.. ‘ఎమర్జెన్సీ’ సినిమా వాయిదా..

ఎమర్జెన్సీ సినిమాకు వెంటనే సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఎమర్జెన్సీ సినిమాకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలయ్యింది.

Emergency Movie: కంగనాకు బాంబే హైకోర్ట్ షాక్.. 'ఎమర్జెన్సీ' సినిమా వాయిదా..
Emergency Movie
Follow us

|

Updated on: Sep 04, 2024 | 8:06 PM

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించలేమని కంగనా పిటిషన్‌పై బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దేశాన్ని మేల్కొనే ప్రయత్నం చేసినందుకు తాను మూల్యం చెల్లిస్తున్నానని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉండగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్‌ పడింది. ఎమర్జెన్సీ సినిమాకు వెంటనే సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించాలని కంగనా దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఎమర్జెన్సీ సినిమాకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలయ్యింది. పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సెన్సార్‌ బోర్డును ఆదేశించింది.

మరోవైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా సిక్కు సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత కంగనా తీరుపై సిక్కు సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో తమను తప్పుగా చూపించారని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. సిక్కు సమాజం నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ కంగనా రనౌత్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ లభించలేదు. సెన్సార్‌ బోర్డు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది ఎమర్జెన్సీ సినిమా యూనిట్‌. అయితే సినిమాలో చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయని, అందుకే సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదని సెన్సార్‌ బోర్డు క్లారిటీ ఇచ్చింది. దేశాన్ని సినిమాతో మేల్కొనే ప్రయత్నం చేస్తున్న తనను చాలామంది టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు కంగనా రనౌత్‌. చైనా, పాకిస్తాన్‌ కుట్రలను స్వాగతిస్తున్న కొందరు తనను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై కంగనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా కంగనా స్వీయదర్శకత్వంలో ఈ సినిమాను తీశారు.

హిమాచల్‌లో వరదలు తగ్గిన తరువాత ఆమె పర్యటించడంపై రాష్ట్ర మంత్రి జగత్‌సింగ్‌ విమర్శలు చేశారు. వర్షం కురిసినప్పుడు ఆమె పర్యటిస్తే మేకప్ చెదిరిపోయేదన్నారు. రేపిస్టులను ప్రోత్సహించేలా జగత్‌సింగ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ విమర్శించింది. ఎమర్జెన్సీ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరించింది కంగనా. తాను సంపాదించిన డబ్బు, ఆస్తులను తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మించానని గతంలో తెలిపింది. అయితే మొదటి నుంచి ఈ సినిమా విడుదలకు తీవ్ర ఆటంకాలు, ఆందోళనలు ఎదురవుతున్నాయి. కంగనా ఎంపీగా గెలవకముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే ఆమెకు ఎన్నికల టికెట్టు రావడంతో విడుదల ఆలస్యమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.