Alia Bhatt: మేమూ మనుషులమే.. మావీ జీవితాలే.. ఆలియా ఘటనపై భగ్గమన్న బాలీవుడ్

సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. వాళ్ల నట్టింట్లోకి తొంగిచూస్తున్నారు. కెమెరాలతో ఫోటోలు, వీడియోలు తీసి.. వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు.

Alia Bhatt: మేమూ మనుషులమే.. మావీ జీవితాలే.. ఆలియా ఘటనపై భగ్గమన్న బాలీవుడ్
ఆలియా భట్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్ భార్య పాత్రను పోషించారు. ఆలియా విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. 10వ తరగతి వరకు మాత్రమే చదివినట్ల తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకున్నట్లుగా సమాచారం.
Follow us

|

Updated on: Feb 24, 2023 | 8:33 AM

మనిషన్నాక.. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటది. సామాన్యుడి దగ్గర నుంచి కెమెరా ముందు మెరిసే నటీనటులు.. మైదానంలో రాణించే ఆటగాళ్ల వరకు.. అందరికీ వాళ్ల, వాళ్ల పర్సనల్ లైఫ్ ఉంటుంది. కాకపోతే సెలబ్రిటీల విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కొంత ఆసక్తి చూపిస్తారు. కానీ అదికాస్తా సృతి తప్పుతోంది. కొందరు లిమిట్స్ క్రాస్ చేసి మరీ వారి వ్యక్తి గత జీవితాల్లోకి తొంగిచూస్తున్నారు. నట్టింట్లో కెమెరాలు పెట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సెలబ్రిటీ లోకం. ప్రైవసీని పైరసీ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తోంది.

మేమూ మనుషులమే.. మావీ జీవితాలే.. ప్రైవసీ ప్లీజ్..!! ఇదీ సెలబ్రిటీలు అందుకున్న లేటస్ట్ స్లోగన్. బాలీవుడ్ నటి ఆలియా భట్‌ను ఆమె ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనంగా షూట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రైవసీపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఫోటోగ్రాఫర్లు ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారంటూ.. ఓ రేంజ్‌లో మండిపడింది. అనుమతి లేకుండా ఫోటోలు తీయడమేంటని మండిపడింది సెలబ్రిటీ లోకం.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు తీయడంపై అలియా భట్ మండిపడింది. దీనిపై ఇన్ స్టా గ్రామ్‌లో సీరియస్‌గా స్పందించింది. నాతో ఆటలాడుకుంటున్నారా? నేను నా ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్న సమయంలో లివింగ్ రూమ్ లో కూర్చుని, ఏదో చూస్తూ ఆస్వాదిస్తున్న సమయంలో.. నా పక్కనున్న బిల్డింగ్ టెర్రస్ నుంచి.. ఫోటోగ్రాఫర్లు కెమెరా నా వైపు పెట్టి ఉంచడాన్ని గమనించాను. ఎక్కడైనా ఇలాంటివి ఆమోదిస్తారా? ఒకరి ప్రైవసీని పూర్తిగా కాలరాయడమే ఇది. హద్దులు దాటి ప్రవర్తించారంటూ.. ఆలియా భట్ పోస్ట్ పెట్టింది. అలాగే ఫోటోగ్రాఫర్ల ఓవరాక్షన్‌పై ముంబై పోలీసులకు అలియాభట్ ఫిర్యాదు చేశారు.

అలియా భట్‌ ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్‌కు సెలబ్రిటీలు మద్దతు ప్రకటిస్తున్నారు. అలాంటి అనుభవాలు తనకు కూడా ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిమ్‌లో ఉన్నా.. బయటకు వెళ్లినా కొంతమంది తనకు తెలియకుండానే ఫోటోస్ తీశారని.. ఇది వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించడమేనంటున్నారు. ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేస్తూ ఈ పోస్ట్‌ పెట్టింది ఆలియా భట్‌.. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. ఆలియాకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా అభ్యంతరకరమైన చర్య. నాకు ఇలాంటి పరిస్థితి చాలా సార్లు ఎదురైంది. నాకు తెలియకుండానే ఫొటోలు తీశారంటూ.. గత అనుభవాలను గుర్తు చేసుకుంది జాన్వీకపూర్.

కోహ్లీ, అనుష్కల కుమార్తె వామిక విషయంలోనూ ఇలాగే

ఇది పూర్తిగా సిగ్గుచేటంటూ మండిపండింది కోహ్లీ భార్య అనుష్క శర్మ. తమ కుమార్తె వామిక విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోలు తీయొద్దని ఎంతగా అభ్యర్థించినా.. చివరకు ఫొటోలు తీసి పోస్టు చేశారని ఆరోపించారు. అంతే కాకుండా విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపైనా కోహ్లీ, అనుష్క జంట తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది.

వీళ్లతో పాటు అర్జున్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, షాహీన్‌ భట్‌ సహా బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు టాలీవుడ్‌లోనూ చాలా మంది సెలబ్రిటీలకు భంగం కలిగించేలా పలువురు వ్యవహరించారు. సెల్ఫీల కోసం ఎగబడటం.. అనుమతి లేకుండా ఫోటోలు తీయడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇలాంటి వాటిపై సీరియస్‌గా స్పందించారు కూడా. ప్రత్యేకత చాటుకోవాలనే ఆరాటం.. ప్రత్యేకతను చాటుకోవాలనే ఆతృతతో కొంత మంది కెమెరామెన్లు, నెటిజన్లు.. హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. వారి వళ్ల అందరికీ చెడ్డపేరు వస్తుందనే చర్చ జరుగుతోంది. గతంలో ఐశ్వర్యారాయ్‌ కూతురు మొదలుపెట్టి కరీనా పిల్లలు.. ధోనీ కూతురు.. విరాట్‌ కూతురు.. ఇలా అందరి కోసం కెమెరా కళ్లు వెతికాయ్‌. కొందరు అతి చేయడమే ఇక్కడ ఇబ్బందిగా మారిందనే వాదన కూడా ఉంది.

అదే సమయంలో సోషల్ మీడియాలో ఇంకో వాదన కూడా తెరపైకి వచ్చింది. సినిమా ప్రమోషన్లు, పబ్లిక్ ఈవెంట్లలోకి వచ్చినప్పుడు అరకొర బట్టలు వేసకుని ఫోజులిస్తారు. హాలిడే ట్రిప్పులకు వెళ్లినప్పుడూ సగం సగం బట్టలతో ఫోటోలు పెడతారు. మళ్లీ అదే సెలబ్రిటీలు తమ పిల్లల్ని మీడియా ముందు చూపించకుండా జాగ్రత్తపడతారు. ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా సెలబ్రిటీలు ప్రవర్తిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా తమ ప్రైవసీ పైరసీ అవుతుండటం పట్ల సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వద్దు అన్న తర్వాత కూడా కొందరు ఎందుకిలా ప్రవరిస్తున్నారు. ఈ పనులకు సోషల్ మీడియా కూడా కారణమా.. ఎలాగైనా.. సోషల్ మీడియాలో తమ వీడియోలు, ఫోటోలు వైరల్ అవ్వాలనుకునే దుగ్ద బ్యాచ్ పనులేనా ఇవి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.