మాస్టర్ ప్లాన్.. సల్మాన్ ఖన్ అట్లీ సినిమాలో ఆ స్టార్ హీరో కూడా నటిస్తున్నాడా.?
అట్లీకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రానికి దర్శకత్వం వహించి హిందీలో అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో అట్లీ సినిమా చేస్తున్నాడని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
సౌత్ దర్శకుడు అట్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అట్లీ ఏ సినిమా చేసిన అది భారీ విజయాన్ని అందుకుంటుంది. అట్లీకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రానికి దర్శకత్వం వహించి హిందీలో అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో అట్లీ సినిమా చేస్తున్నాడని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట అట్లీ. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పై బాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అట్లీ సల్మాన్ ఖాన్ సినిమాలో యూనివర్సల్ స్టార్ నటుడు కమల్ హాసన్ కూడా నటిస్తాడని అంటున్నారు. సల్మాన్ ఖాన్, అట్లీ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని బాలీవుడ్‌లో చాలా రోజులుగా ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ కానీ, అట్లీ కానీ అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త వినగానే సల్మాన్ ఖాన్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.
అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని టాక్. అయితే సల్మాన్‌ఖాన్‌తో సెకండ్ లీడ్‌గా నటించేందుకు ఏ హీరో ఒప్పుకుంటాడనే ప్రశ్న చాలా కాలంగా అభిమానుల మదిలో మెదులుతోంది. ఇప్పుడు కమల్ హాసన్ పేరు వినిపించడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కమల్ హాసన్ కు బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ 2025 జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఇద్దరు హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.