
బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె తన కంటే 12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. వారిద్దరూ దాదాపు 6 సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలారు. ఇంత పెద్ద వయసు అంతరం ఉన్నప్పటికీ, అర్జున్-మలైకా కెమిస్ట్రీ, జోడీ చాలా మందికి నచ్చింది. అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరూ సడెన్ గా విడిపోయారు. ఇక అర్జున్ తో విడిపోయిన తర్వాత, మలైకా ఒక యువ వ్యాపారవేత్తతో ఎక్కువగా కనిపిస్తోంది.
ముంబైలో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలో, మలైకా హర్ష్ మెహతా అనే యువకుడితో సెల్ఫీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రేమికుల దినోత్సవం నాడు వీరిద్దరూ ఫారిన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మలైకా, హర్ష్ మధ్య వయస్సు అంతరం గురించి సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.
మలైకా వయస్సు 52 సంవత్సరాలు. అలాగే హర్ష వయసు 33 సంవత్సరాలు . అంటే వీరిద్దరి మధ్య సుమారు 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. హర్ష్ మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారి అలాగే హర్ష్ సంకాస్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఆయన వద్ద కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక మలైకా, హర్ష్ పలు సార్లు జంటగానే కనిపించారు. అయితే తమ రిలేషన్ షిప్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మలైకా 2018 లో నటుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ ప్రారంభించింది. గత సంవత్సరం ఇద్దరూ విడిపోయారు. అంతకు ముందు, ఆమె నటుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. మలైకా 2017 లో విడాకులు తీసుకుంది. అర్బాజ్, మలైకాకు ఒక కుమారుడు ఉన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.