AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఏమైందంటే?

పెళ్లి కొందరి జీవితాల్లో ఆనందం నింపితే మరికొందరి జీవితాలను నరకంగా మారుస్తుంది. తల్లిదండ్రులు, కుటుంబీకులందరినీ వదిలి పెట్టి అత్తింటికి వెళ్లిన అమ్మాయికి భర్తే యముడిగా మారితే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరోయిన్ ది కూడా అదే పరిస్థితి.

Tollywood: కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్.. ఏమైందంటే?
Celina Jaitly
Basha Shek
|

Updated on: May 07, 2026 | 4:47 PM

Share

బాలీవుడ్‌ ప్రముఖ నటి, మాజీ మిస్‌ ఇండియా సెలీనా జైట్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందంతో ప్రపంచాన్ని ఏలిన ఈ తార తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో హీరోయిన్ గా చేసిందీ అందాల తార. అలాగే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈ నటికి పెళ్లి అసలు కలిసి రాలేదు. సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ ను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఇందులో ఒక కుమారుడు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక ఇప్పుడు భార్యా భర్తల మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 2025 నవంబర్‌లో ముంబై కోర్టులో గృహ హింస కేసును దాఖలు చేసింది సెలీనా. తన భర్త పీటర్‌ హాగ్‌పై గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. నెలకు రూ.10 లక్షల భరణంతోపాటు రూ.50 కోట్ల పరిహారాన్ని పీటర్‌ నుంచి ఇప్పించాలని కోరుతోంది. ప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో ఉంది. అయితే భర్త పీటర్ హాగ్ నుండి విడాకులు తీసుకుంటున్న సమయంలో, తన పిల్లలను కలుసుకోనివ్వడం లేదంటోంది సెలీనా. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, తన పిల్లలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని, కనీసం వారితో మాట్లాడేందుకు కూడా అనుమతి లభించడం లేదని కన్నీరుమున్నీరవుతోంది. అందుకే సమాధిలో నిద్రిస్తున్న తన బిడ్డను కలుసుకోవడం తప్ప తనకు మరో గత్యంతరం లేదంటూ వాపోయింది.

కాగా ఆస్ట్రియాలో ఉన్న తన దివంగత కుమారుడు శంషేర్ సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడుస్తూ, దాన్ని శుభ్రం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది సెలీనా.’ విడాకుల కేసు విచారణ కోసం ఆస్ట్రియా వెళ్లిన నాకు, నా ముగ్గురు పిల్లలను కలిసే అవకాశం లభించడం లేదు. అందుకే కేవలం మరణించిన కుమారుడిని మాత్రమే కలుసుకోగలిగాను. నేను నా భర్త కోసం నా దేశాన్ని వదులుకున్నాను. సినిమా కెరీర్ ను, తల్లిదండ్రులు వదిలిపెట్టి ఆయన కోసం దుబాయ్, సింగపూర్, ఆస్ట్రియా దేశాలు పట్టుకొని తిరిగాను. చివరికీ నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. నా పిల్లలపై నాకు తప్పుడు అభిప్రాయం కలిగించేలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మీడియాలో నాపై తప్పుడు కథనాలు వచ్చేలా చేస్తున్నారు. ఒక తల్లిగా నా బాధను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ వీడియోను షేర్ చేస్తున్నా’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది సెలీనా జైట్లీ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్
హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..
హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..
ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?
ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?
నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?
నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?
ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు
ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు