AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఓటీటీల్లో మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు అయితే ఓ రేంజ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే.

OTT Movie: కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటన.. ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 06, 2026 | 6:58 PM

Share

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు ఈ మధ్యన మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో ఇలాంటి రియల్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. కేరళ త్రిస్సూర్ లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. త్రిస్సూర్ తో పాటు కేరళ రాష్ట్రం మొత్తాన్ని ఈ కేసు కుదిపేసింది. ఈ సంఘటనకు కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్‌ ఉన్నాయి. కథ విషయానికి వస్తే.. ప్లాంటర్ శామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోతాడు. అందరూ దీనిని యాక్సిడెంట్ అనుకుంటారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలను చూసి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ మాత్రం ఇది ప్రమాదం కాదని భావిస్తాడు. షాజీ అనే ఒక ఆటో డ్రైవర్ ను అనుమానిస్తాడు. అయితే అనూహ్యంగా ఆ ఆటో డ్రైవర్ కూడా ఒక క్వారీ ప్రమాదంలో చనిపోతాడు. అక్కడ దొరికిన ఆధారాలతో ఫ్రాన్సిస్ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి అది రోడ్డు యాక్సిడెంటేనా? కాదా? మర్డర్ అయితే ఎవరు చంపారు? పోలీసుల విచారణలో చివరకు ఏం తేలింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్‌ పేరు కమ్మటం. షాన్ తులసీధరన్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఓజీ నటుడు సుదేవ్ నాయర్ ప్రధాన పాత్రలో మెరిశారు. అలాగే జిన్స్, జియో బేబీ, అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరే, జోర్డీ పూంజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ కేవలం ఒరిజినల్ మలయాళ వెర్షన్ లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను చూడాలనుకునేవారిక ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో కమ్మటం వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్