Tollywood: బాలీవుడ్ స్టార్స్ చూపు టాలీవుడ్ వైపు.. ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నటులు
ఇదిగో.. ఇప్పుడు ఆస్కార్ సాక్షిగా ఇండియన్ సినిమా ముఖచిత్రం టాలీవుడే అని గ్రాండ్‌గా, గ్రేట్‌గా చెప్పుకుంటున్నాం. ట్రిపుల్ ఆర్‌లో సీతగా నటించిన ఆలియాను, అల్లూరి సీతారామరాజు తండ్రిగా నటించిన అజయ్ దేవ్‌గణ్‌ని మనవాళ్లు గుండెల్లో పెట్టుకున్నారు.
![Tollywood: బాలీవుడ్ స్టార్స్ చూపు టాలీవుడ్ వైపు.. ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నటులు](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/movies.jpg?w=1280)
మొన్న మొన్నటిదాకా నార్త్ వర్సెస్ సౌత్‌లో మద్రాసీలుగా మిగిలిపోయిన మనం, రీసెంట్ టైమ్స్ లో తెలుగువాళ్లమంటూ ఢంకా భజాయించాం. ఇదిగో.. ఇప్పుడు ఆస్కార్ సాక్షిగా ఇండియన్ సినిమా ముఖచిత్రం టాలీవుడే అని గ్రాండ్‌గా, గ్రేట్‌గా చెప్పుకుంటున్నాం. ట్రిపుల్ ఆర్‌లో సీతగా నటించిన ఆలియాను, అల్లూరి సీతారామరాజు తండ్రిగా నటించిన అజయ్ దేవ్‌గణ్‌ని మనవాళ్లు గుండెల్లో పెట్టుకున్నారు. మొన్న మొన్నటిదాకా మన సినిమాల్లో ఇలా బాలీవుడ్ జనాలు నటిస్తే గొప్పగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి.. మన సినిమాల్లో ఒక్క ఛాన్స్ వస్తే చాలనుకునే పొజిషన్‌లో పొరుగు భాషల వాళ్లు ఎదురుచూస్తున్నారు.
లాస్ట్ ఇయర్ మెగాస్టార్ చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా గాడ్‌ఫాదర్. ఇందులో చోటాభాయ్‌గా నటించారు సల్మాన్‌ఖాన్. తార్ మార్ టక్కర్ మార్ అంటూ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే మురిసిపోయారు మన జనాలు. వావ్.. ఇది కదా కొలాబరేషన్ అంటే అని ఎంజాయ్ చేశారు భాయ్ ఫ్యాన్స్ . కేజీయఫ్‌లో సంజూబాబా లుక్‌కే సగం మంది ఫిదా అయ్యారు. ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారంటూ ప్రశంసలు కురిపించారు. కేజీయఫ్ సీక్వెల్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి, ఇప్పుడు విజయ్ మూవీ లియోకి పచ్చజండా ఊపేశారు సంజయ్ దత్. ఇప్పుడు ఆ వరుసలో అజయ్ దేవ్‌గణ్ పేరు వినిపిస్తోంది. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్‌లో లంకేశ్వరుడి కేరక్టర్‌లో కనిపిస్తున్నారు అజయ్ దేవ్‌గణ్.
ఇప్పుడు ఎన్టీఆర్ 30లో విలన్‌గా సైఫ్ అలీఖాన్ పేరు వినిపిస్తోంది.ట్రిపుల్ ఆర్ సినిమా కోసం డెడికేటెడ్‌గా కాల్షీట్ కేటాయించిన తారక్, ఆస్కార్ వేడుకలకు హాజరై రీసెంట్‌గా హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. ఈ నెల 18న కొరటాల శివ సినిమా షూటింగ్ ఉంటుంది. రెండు, మూడు రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో హీరోయిన్‌గా ఆల్రెడీ జాన్వీ కపూర్ ఫైనల్ అయింది. విలన్ కేరక్టర్‌లో సైఫ్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటిస్తారనే మాటలున్నాయి. కొరటాల – తారక్ కాంబో అనగానే జనతాగ్యారేజ్‌ని మించిన సబ్జెక్ట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.