AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ‘నీ చదువు ఆపొద్దు తల్లి’.. ఏపీ విద్యార్థినికి అండగా సోనూ సూద్‌.. సాయం చేస్తానని మాటిచ్చిన రియల్ హీరో

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రార్థించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచి తన గొప్ప మనసును

Sonu Sood: 'నీ చదువు ఆపొద్దు తల్లి'.. ఏపీ విద్యార్థినికి అండగా సోనూ సూద్‌.. సాయం చేస్తానని మాటిచ్చిన రియల్ హీరో
Sonu Sood
Basha Shek
|

Updated on: Jul 20, 2024 | 6:42 AM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రార్థించే పెదవులు కన్నా..సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తున్నారు. సొంతంగా ‘సోనూ ఫౌండేషన్’ స్థాపించి అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు. అలా తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు సోనూ సూద్. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక విద్యార్థిని ‘నా చదువుకు హెల్ప్ చేయండి సార్‌’ అని వేడుకుంటోన్న వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండు’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు.

ఆంధ్రప్రదేశ్‌లో బనవనూరుకు చెందిన మాదిగ దేవీ కుమారి అనే అమ్మాయి బీఎస్ సీ చదవాలనుకుంటోంది. అయితే కటిక పేదరికం ఆమె చదువుకు అడ్డు పడుతోంది. దీంతో ‘ నా చదువుకు హెల్ప్ చేయండి సార్’ అంటూ అందరినీ వేడుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ దేవీ కుమారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించాడు. ‘నీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు తల్లి.. కాలేజీకి వెళ్లడానికి సిద్ధంగా ఉండూ’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోనూ సోద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సోనూసూద్ రియల్ హీరో’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ రిప్లై ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఫతేహా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనే దర్శకత్వం కూడా వహించనున్నాడు.

భారీ వర్షంలోనూ ప్రజల సమస్యలు తెలుసుకుంటోన్న రియల్ హీరో సోనూసూద్..

విద్యార్థులతో సోనూసూద్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?