బాపట్ల జిల్లా చీరాల మహాత్మా గాంధీ కాలనీలో తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరు కోర్టు ఏపీపీ బచ్చు వెంకటలక్ష్మి కుమారి, ఆమె సోదరుడిపై దాడి చేసి ఎనిమిది సవర్ల బంగారాన్ని దోచుకెళ్లారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి, వారి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.