AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot Benefits: పచ్చిదా? వండినదా? బీట్‌రూట్ ఎలా తింటే మీ రక్తం బుల్లెట్ వేగంతో పెరుగుతుందో తెలుసా?

బీట్‌రూట్ అనగానే మనకు గుర్తొచ్చేది దాని గాఢమైన ఎరుపు రంగు. కేవలం రంగులోనే కాదు, పోషకాల్లో కూడా ఇది ఎంతో 'రిచ్'. రోగనిరోధక శక్తిని పెంచడం నుండి రక్తపోటును నియంత్రించడం వరకు బీట్‌రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, చాలా మందికి ఉండే పెద్ద సందేహం ఏంటంటే.. బీట్‌రూట్‌ను పచ్చిగా తింటే మంచిదా లేక వండుకుని తింటే మంచిదా? తాజా అధ్యయనాల ప్రకారం ఈ రెండు పద్ధతుల్లోనూ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పోషకాల లభ్యతలో చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నాయి.

Beetroot Benefits: పచ్చిదా? వండినదా? బీట్‌రూట్ ఎలా తింటే మీ రక్తం బుల్లెట్ వేగంతో పెరుగుతుందో తెలుసా?
Amazing Benefits Of Beetroot Raw Vs Cooked
Bhavani
|

Updated on: Jan 27, 2026 | 5:25 PM

Share

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (2021) ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు 8 వారాల పాటు ప్రతిరోజూ పచ్చి బీట్‌రూట్‌ను తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు, రక్తపోటు గణనీయంగా తగ్గాయి. అంతేకాకుండా, ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని తేలింది. అదే సమయంలో, ఉడికించిన బీట్‌రూట్ జీర్ణక్రియకు ఎంతో సులభంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కూరగాయ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి బీట్‌రూట్ వర్సెస్ ఉడికించిన బీట్‌రూట్:

పచ్చి బీట్‌రూట్ : ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు గరిష్టంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు వాపులను తగ్గిస్తాయి. అథ్లెట్లకు స్టామినా పెంచడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.

ఉడికించిన బీట్‌రూట్ : బీట్‌రూట్‌ను ఉడికించడం వల్ల అందులోని పీచు పదార్థం మెత్తబడుతుంది, దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఉడికించిన తర్వాత కూడా ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అలాగే ఉంటాయి. అయితే, నీటిలో కరిగే విటమిన్లు వేడి వల్ల కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకునే 4 సులభమైన మార్గాలు: జ్యూస్ లేదా స్మూతీ: బీట్‌రూట్‌ను ఆపిల్, క్యారెట్ లేదా ఆరెంజ్‌తో కలిపి జ్యూస్ లా చేసుకుని తాగితే అది ఒక అద్భుతమైన ‘డిటాక్స్ డ్రింక్’లా పనిచేస్తుంది.

సలాడ్స్: పచ్చి బీట్‌రూట్‌ను తురిమి ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ నట్స్‌తో కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు.

బీట్‌రూట్ రైతా: తురిమిన బీట్‌రూట్‌ను పెరుగులో కలిపి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చాట్ మసాలా చల్లుకుంటే రుచికరమైన రైతా సిద్ధం.

బీట్‌రూట్ సబ్జీ లేదా పరాఠా: ఉడికించిన బీట్‌రూట్‌తో కూర వండుకోవచ్చు లేదా దానిని మెత్తగా చేసి పరాఠాల్లో స్టఫింగ్ లా వాడుకోవచ్చు. పిల్లలకు బీట్‌రూట్ పాన్ కేక్స్ కూడా ఒక మంచి హెల్తీ ఆప్షన్.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.