దేశభక్తికి మాటలతో పనేముంది ?? సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
ప్రకాశం జిల్లా అద్దంకిలోని బధిరుల పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మాటలు రాని, పాటలు వినపడని ఆ చిన్నారులు సైగల ద్వారా తమ దేశభక్తిని చాటారు. సైగల భాషలో జాతీయ గీతం ఆలపించి, రాజ్యాంగ విశిష్టతను తెలుసుకున్నారు. శారీరక లోపాలు దేశభక్తికి అడ్డుకావని నిరూపించిన వారి స్ఫూర్తి అందరినీ కదిలించింది.
భాష ఏదైనా భావం ఒక్కటే… మాట రాకపోయినా, పాట వినబడకపోయినా వారి గుండెల్లో దేశభక్తి మాత్రం గట్టిగా ప్రతిధ్వనించింది. ప్రకాశంజిల్లా అద్దంకిలోని బదిరుల పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకలు అందరినీ కదిలించాయి. సైగలనే స్వరాలుగా చేసుకుని ఆ చిన్నారులు ఆలపించిన జాతీయ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారికీ మాటలు రావు.. కానీ వారి భావాల్లో స్పష్టత ఉంది. వారికి పాట వినబడదు.. కానీ వారి సైగల్లో లయ ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకిలోని చైతన్య మహిళా మండలి బధిరుల పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవం వేళ దేశభక్తిని చాటారు. గత 26 ఏళ్లుగా బధిర విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఈ పాఠశాలలో గణతంత్ర వేడుకలు మిన్నంటాయి. సంస్థ అధ్యక్షురాలు పూనూరి ఆరోగ్యం జెండా ఎగురవేయగా, ప్రిన్సిపల్ సురేంద్రబాబు భారత రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సాధారణ విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని.. సైగల భాషలోనే రాజ్యాంగ విశిష్టతను తెలుసుకుంటూ ఆ చిన్నారులు ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా విద్యార్థులు సైగలతో వందేమాతరం జాతీయ గీతాన్ని ఆలపించడం అక్కడికి వచ్చిన వారిని మంత్రముగ్ధులను చేసింది. పెదవి విప్పకపోయినా.. వారి చేతుల కదలికలే దేశం పట్ల వారికున్న గౌరవాన్ని చాటిచెప్పాయి. అంగవైకల్యం శరీరానికే కానీ..మనసుకు కాదని, శారీరక లోపాలు దేశభక్తికి అడ్డుకాదని నిరూపించాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి
నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి
ఐఏఎస్, ఐపీఎస్ ఆదర్శ వివాహం ఆడంబరాలకు దూరం, యువతకు స్ఫూర్తి

