Black Rice Benefits: నల్ల బియ్యం ఎప్పుడైనా తిన్నారా.. ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!
ఏం తిన్నా, ఎంత తిన్నా.. అన్నం తింటేనే భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే మన దేశంలో చాలా మంది రోటీస్, ఇతర ఆహారాల కంటే అన్నానికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కవగా చాలా మంది తెల్ల బియ్యంతో వండి అన్నమే ఎక్కువగా తింటారు. కానీ నల్ల బియ్యం కూడా ఉంటాయని ఎంతమందికి తెలుసు.. నల్ల బియ్యం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి.

ప్రస్తత రోజుల్లో ప్రతి ఒక్కరూ అన్నం తినడానే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. అందులోనూ పులిహోర, చిత్రన్నం, కిచిటీ, బిర్యానీ ఇలా ఏది వండుకోవాలన్నా.. అందులో బియ్యం కంపల్సరి. అయితే వీటిలోకి మనం ఏ రకమైన బియ్యం లేదా నాణ్యతను ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యం కాదు. మనం బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తాము. ఈ రోజుల్లో, నల్ల బియ్యానికి ప్రతిచోటా ప్రాధాన్యత పెరుగుతోంది. నల్ల బియ్యంలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. దీనివల్ల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తెల్ల బియ్యం కాకుండా నల్ల బియ్యం బియ్యంగా తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది శరీరంలోని ప్రతి స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఈ నల్ల బియ్యంలో ఆంథోసైనిన్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించి కణాల వృద్యాప్యాన్ని తగ్గిస్తుంది. ఈ బియ్యంలో ఫ్లేవనాయిడ్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి. బ్లాక్ రైస్ తినడం వల్ల ధమనులలో ప్లేక్ పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలు నివారిస్తుంది.
నల్ల బియ్యం మన శరీరాన్ని లోపలి నుంచి క్లీన్‌లో ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైటోన్యూట్రియెంట్లు హానికరమైన అంశాలను తొలగించి కాలేయాన్ని రక్షిస్తాయి. అలాగే ఇది చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి నల్ల బియ్యం చాలా మంచివి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి ఇవి ఎంతో ఉత్తమంగా ఉంటాయి. ముఖ్యంగా, నల్ల బియ్యం తెల్ల బియ్యం కంటే తక్కువ GI ట్యాగ్ కలిగి ఉంటుంది, ఇది వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
