మీ ఆయుష్షును నిర్ణయించేది.. మీ నిద్రేనట!

27 January 2026

TV9 Telugu

TV9 Telugu

రాత్రి నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతిగా అందరూ భావిస్తారు. కానీ ఒక రాత్రిలో మన నిద్ర నాణ్యత ఆధారంగా ఆయుష్షును నిర్ధరించవచ్చట

TV9 Telugu

అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా వచ్చే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను అంచనా వేయవచ్చని తెలిపారు

TV9 Telugu

రక్త పరీక్షలు, ఎక్స్‌-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే రానున్నాయన్నమాట

TV9 Telugu

స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు తాజాగా Sleep FM అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ పనితీరును పర్యవేక్షిస్తుంది

TV9 Telugu

మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర  శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది

TV9 Telugu

తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది. సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్‌ను రూపొందించారు

TV9 Telugu

ఈ స్లీప్‌ఎఫ్‌ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్‌ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు వ్యాధులను 85% ఖచ్చితత్వంతో అంచనా వేసింది

TV9 Telugu

కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే. ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75% కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తుందన్నమాట