వేరుశనగ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు.
వేరుశనగలు
మరీ ముఖ్యంగా కొంత మంది పల్లీలను వేయించి తీసుకుంటే, మరికొంత మంది ఉడకబెట్టి, మరికొందరు నార్మల్‌గా తింటుంటారు.
ఉడికించినవి
అయితే ఇప్పుడు మనం పల్లీలను ఉడకబెట్టి తినవచ్చా? తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రయోజనాలు
ఉడికించిన వేరుశనగలు ప్రతి రోజూ మీ డైట్‌లో స్నాక్స్ గా తీసుకోవడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట.
స్నాక్స్
ఉడికించిన వేరుశనగల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువలన ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
పోషకాలు పుష్కలం
అలాగే ఉడికించిన పల్లీలలో మోనోఅన్ శాచురేటెడ్ , పాలీ అన్ శాచురేటెడ్ అనే కొవ్వుల ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుండె జబ్బుల ప్రమాదం
ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన ఉడకబెట్టిన వేరుశనగలు తినడం వలన ఇవి బరువు నియంత్రణకు దోహదం చేస్తాయి. బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్ ఎంపిక.
కేలరీలు పుష్కలం
ఉడికించిన వేరుశనగలు తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వీటిలో గ్లైసెమిక్ ఉండటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గేలా చేస్తాయి.