Gold Prices: బంగారం ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం..? బడ్జెట్‌లో కీలక ప్రకటన..! దిగిరానున్న ధరలు..?
బడ్జెట్‌లో బంగారంపై కేంద్రం దిగుమతి సుంకం, జీఎస్టీ తగ్గించనుందా..? దీంతో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పెరిగిన బంగారం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్ల సమయంలో గోల్డ్ కొనాలంటేనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి.

ప్రస్తుతం బంగారం ధరలు రెచ్చిపోతున్నాయి. జెడ్ స్పీడ్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దీంతో సామాన్యుడికి అందనంత దూరంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం మంగళవారం నాటికి తులం బంగారం రూ.1.61 లక్షలకు చేరుకుంది. ఇక కేజీ వెండి అయితే ఒకేసారి రూ.12 వేలు పెరిగి రూ.3.87 లక్షలకు చేరుకుంది. త్వరలో కేజీ వెండి 4 లక్షల మార్క్‌కు చేరుకునేందుకు రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దిగుమతి సుంకాలు, జీఎస్టీ రేట్లను తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కూడా తిరిగి ప్రారంభించాలని చూస్తోంది. దీంతో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు, సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు.
బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపు..?
భారత్ విదేశాల నుంచి బంగారాన్ని ఎక్కువగా దేశంలోని దిగుమతి చేసుకుంటుంది. దీంతో బంగారంపై విధించే దిగుమతి సుంకాల ప్రభావం కూడా ధరలపై ఉంటుంది. కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో బంగారంపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని మార్కెట్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. సుంకాలను తగ్గిస్తే బంగారం ధరలు కాస్త తగ్గనున్నాయి. దీంతో సుంకాలు తగ్గిస్తే రిటైల్ మార్కెట్ పెరగడమే కాకుండా తయారీ రంగం కూడా అభివృద్ది చెందుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సుంకాలు, పన్నుల్లో మార్పుల వల్ల గోల్డ్ రేట్లు ఇండియాలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులకు షాక్ తగులుతోంది. ఇండియాలో గోల్డ్‌ను ఒక లోహంగానే కాకుండా భద్రత, సంప్రాదాయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో కొనుగోలు చేయలేకపోతున్నారు. దీంతో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు షాపింగ్‌ను సులభతరం చేసేలా బడ్జెట్‌లో ప్రకటనలు ఉంటాయని చెబుతున్నారు.
బంగారంపై జీఎస్టీ తగ్గింపు..?
బంగారాన్ని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తారు. దీంతో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తిరిగి తీసుకురావాలని నిపుణులు ప్రభుత్వాన్ని బలంగా కోరుతున్నారు. ఈ పథకం పెట్టుబడిదారులు ఉపయోగకరంగా మారనుంది. 2.5 శాతం వడ్డీ రేటు అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. 2024లో ఈ పథకం నిలిపివేయగా.. ఇప్పుడు దానిని తిరిగి పునరుద్దరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక బంగారం కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బంగారం అభరణాలపై 3 శాతం జీఎస్టీ ఉంది. దీనిని 1.25 లేదా 1.5 శాతం తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బంగారం రేట్లు ఇండియాలో తగ్గుతాయి. దీని వల్ల ప్రజలతో పాటు సేల్స్ పెరగడం వల్ల వ్యాపారులు లబ్ది పొందుతారని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. దీంతో బడ్జెట్ తర్వాత బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.
