అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం
అమరావతి రైతులకు జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులకు సీఆర్డీఏ ప్లాట్లను పంపిణీ చేయనుంది. పారదర్శక ఈ-లాటరీ విధానం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రైతులు తమ అర్హతను తనిఖీ చేసుకొని రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు.
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపును నిర్వహించనుంది. గతంలో జనవరి 28న లాటరీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కీలక కార్యక్రమాలు ఉన్నందున దీనిని 29వ తేదీకి వాయిదా వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఉండవల్లి, పెనుమాక సహా ఇతర గ్రామాలకు చెందిన రైతులు ఐదేళ్లకు పైగా తమ పెండింగ్ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కోసం నిరీక్షిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !! ఆమెతోనే కలిసి వచ్చి..మాయమైన కిలాడీ దొంగ
విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే
Kethireddy Venkatarami Reddy: ఎన్ని కేసులు పెడితే అంత ఉత్సాహంతో పోరాటం చేస్తాం
ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మూగబోయాను.. కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు
అందాల పక్షి ఆఖరి పోరాటం.. అంతరించిపోతున్న జాతి

