Guess The Celebrity: లేడీ గెటప్‌లో ఉన్న ఈ వర్సటైల్‌ యాక్టర్‌ను గుర్తుపట్టారా? తలైవాతో కూడా తలపడ్డాడండోయ్‌

కెరీర్‌ ఆరంభం నుంచే భిన్నమైన పాత్రలు పోషిస్తున్న అతను బాలీవుడ్‌ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూనే విలన్‌గా, హీరోగానూ మెప్పిస్తున్నాడు. కేవలం హిందీలోనే కాదు దక్షిణాదిలోనూ మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Guess The Celebrity: లేడీ గెటప్‌లో ఉన్న ఈ వర్సటైల్‌ యాక్టర్‌ను గుర్తుపట్టారా?  తలైవాతో కూడా తలపడ్డాడండోయ్‌
Guess The Celebrity
Follow us

|

Updated on: Dec 17, 2022 | 7:02 PM

సినిమా ఇండస్ట్రీలోని కొందరు నటీనటులు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తారు. తాము పోషించే క్యారెక్టర్‌కు సహజతనం రావాలని ఎంతైనా కష్టపడతారు. రంగు, రూపు, ఆహార్యం అన్నింటినీ మార్చుకుంటారు. న్యాచురల్‌గా కనిపించేందుకు శరీరాన్ని హూనం చేసుకుంటారు. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో మహిళా గెటప్పులో ఉన్నది ఓ బాలీవుడ్‌ నటుడు. కెరీర్‌ ఆరంభం నుంచే భిన్నమైన పాత్రలు పోషిస్తున్న అతను బాలీవుడ్‌ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూనే విలన్‌గా, హీరోగానూ మెప్పిస్తున్నాడు. కేవలం హిందీలోనే కాదు దక్షిణాదిలోనూ మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్నట్లు దక్షిణాదిన తలైవా రజనీకాంత్‌ తో కూడ ఓ సినిమాలో పోటాపోటీగాతలపడ్డాడు. ఇప్పుడు కూడా ఓ సినిమా కోసం ట్రాన్స్‌ జెండర్‌ గా మారిపోయాడు. సినిమా ప్రమోషన్ల కోసం ఆ నటుడి లేటెస్ట్‌ పిక్స్‌ ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఇంతకీ లేడీ గెటప్పులో కనిపిస్తోన్న ఈ వెర్సటైల్‌ యాక్టర్‌ ఎవరో గుర్తుపట్టారా?

ఈయన మరెవరో కాదు బాలీవుడ్‌ నటుడు కమ్‌ విలన్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం హడ్డీ. ఇందులో ట్రాన్స్‌ జెండర్‌ పాత్రలో కనిపించనున్నారు సిద్ధీఖీ. ఈ పాత్ర కు న్యాచురల్‌ లుక్‌ రావడం కోసం తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఇందుకోసం నిపుణుల సమక్షంలో మూడు గంటల పాటు కుర్చీలో కూర్చొని మరీ లుక్‌ మార్చుకున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నవాజుద్దీన్‌ మేకోవర్‌ పై ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, ఆనందితా స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2023లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..