AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Director: తారక్ నుంచి చరణ్‌కు షిఫ్టయ్యాడు.. అయినా సరే బుచ్చిబాబుకు పెద్ద చిక్కొచ్చి పడింది

శంకర్ తర్వాత యువీ క్రియేషన్స్‌తో సినిమాకు కమిటయ్యారు రామ్ చరణ్. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోయింది. ఈ లోపు బుచ్చిబాబు కథ ఓకే చేసారు.

Uppena Director: తారక్ నుంచి చరణ్‌కు షిఫ్టయ్యాడు.. అయినా సరే బుచ్చిబాబుకు పెద్ద చిక్కొచ్చి పడింది
Buchibabu - JR NTR
Ram Naramaneni
|

Updated on: Dec 17, 2022 | 7:39 PM

Share

దర్శకుడు బుచ్చిబాబుకు మరోసారి ఎదురుచూపులు తప్పవా..? జూనియర్ ఎన్టీఆర్‌ను నమ్ముకుంటే వెయిటింగ్ తప్ప ఏం లేదని తెలుసుకుని.. రామ్ చరణ్ వైపు వచ్చిన ఈ దర్శకుడికి.. అక్కడా ఎదురు చూపులే పలకరించబోతున్నాయా..? కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ కూడా ఆలస్యం అవ్వడానికి రీజన్ ఏంటి..? శంకర్ తర్వాత బుచ్చిబాబు కాకుండా మరో దర్శకుడి వైపు రామ్ చరణ్ వెళ్తున్నారా..? అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి.  ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోతుంది.. అదృష్టం అనేది తర్వాత మ్యాటర్ అంటుంటారు. కానీ అందులో నిజం లేదని దర్శకుడు బుచ్చిబాబును చూస్తుంటే అనిపిస్తుంది. బోలెడంత టాలెంట్ ఉంది.. కథ సిద్ధంగా ఉంది.. నిర్మాతలు రెడీగా ఉన్నారు.. కానీ హీరో మాత్రం దొరకడం లేదు ఈయనకు. జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని.. రామ్ చరణ్ వైపు వస్తే.. ఇక్కడా ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే.

2021 ఫిబ్రవరిలో ఉప్పెన విడుదలైంది. ఆ సినిమా విడుదలైన మూడు నెలలకే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసిన ఈ దర్శకుడు.. అప్పట్నుంచి ఎన్టీఆర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యే మనసు మార్చుకుని.. రామ్ చరణ్ వైపు వచ్చారు బుచ్చిబాబు. మైత్రి మూవీ మేకర్స్, విృద్ధి సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే శంకర్ తర్వాత.. వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టడానికి చరణ్‌కు కొన్ని ఇబ్బందులున్నాయి.

శంకర్ తర్వాత యువీ క్రియేషన్స్‌తో సినిమాకు కమిటయ్యారు రామ్ చరణ్. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాల్సిన సినిమా ఆగిపోయింది. ఈ లోపు బుచ్చిబాబు కథ ఓకే చేసారు చరణ్. అయితే యువీ క్రియేషన్స్ వాళ్ళ తర్వాతే.. బుచ్బిబాబు సినిమా సెట్స్‌పైకి వస్తుందని తెలుస్తుంది.. లేదంటే రెండూ ఒకేసారి చేస్తారా అనేది ఆసక్తికరమే. ఎలా చూసుకున్నా.. ఉప్పెన దర్శకుడికి మరోసారి వెయిటింగ్ తప్పదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..