Raviteja: రవితేజ సందర్భాన్ని బట్టి చెప్పినా.. తగలాల్సిన వాళ్లకి గట్టిగా తగులుతున్నాయ్

అప్పుడప్పుడూ క్లాస్‌గా ప్రయత్నించినా.. ఈయన్ని మాత్రం ప్రేక్షకులు మాస్‌గానే చూడాలనుకుంటారు. అభిమానులు కోరుకున్నట్లు రవితేజ కూడా అలాంటి సినిమాలే చేస్తుంటారు.

Raviteja: రవితేజ సందర్భాన్ని బట్టి చెప్పినా.. తగలాల్సిన వాళ్లకి గట్టిగా తగులుతున్నాయ్
Hero Raviteja
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 17, 2022 | 8:15 PM

వారసులపై రవితేజ సెటైర్లు వేస్తున్నారా..? నెపోటిజం గురించి మాస్ పంచులు పేలుస్తున్నారా..? వారసత్వంపైనే మాటల తూటాలు వదులుతున్నారా..? ఈ అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి అనుకుంటున్నారా..? ఈ మధ్య మాస్ రాజా సినిమాల్లో డైలాగులు వింటుంటే.. ఇదే అనిపిస్తుంది. తాజాగా ధమాకాలోనూ తాను సపోర్ట్ లేకుండా.. సొంతంగా ఎదిగానని మరోసారి గుర్తు చేసారు మాస్ రాజా. టాలీవుడ్‌లో మాస్‌కు కేరాఫ్ అడ్రస్ రవితేజ సినిమాలు. అప్పుడప్పుడూ క్లాస్‌గా ప్రయత్నించినా.. ఈయన్ని మాత్రం ప్రేక్షకులు మాస్‌గానే చూడాలనుకుంటారు. అభిమానులు కోరుకున్నట్లు రవితేజ కూడా అలాంటి సినిమాలే చేస్తుంటారు. హిట్ వచ్చినా.. ఫ్లాపొచ్చినా మాస్ రాజా మాత్రం కమర్షియల్ కథల వైపు అడుగేస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే చిరంజీవి తర్వాత గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్నది రవితేజ ఒక్కడే.

ఈ జనరేషన్‌లో ఉన్న విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలకు ఇన్స్‌స్పిరేషన్ రవితేజనే. అయితే తాను సొంతంగా ఎదిగాననే సంగతి పదే పదే గుర్తు చేస్తున్నారు రవితేజ. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడూ సెటైర్లు పేలుస్తున్నారు. క్రాక్ సినిమాలో బ్యాగ్రౌండ్ అనే వినబడితే విలన్లను బాదేస్తుంటారు మాస్ రాజా. ఆ సినిమా కథ అంతా బ్యాగ్రౌండ్ అనే పదం చుట్టూనే తిరుగుతుంది. రామారావు ఆన్ డ్యూటీ, బెంగాల్ టైగర్‌లోనూ సెటైర్లు వేసారు రవితేజ.

నేను సపోర్ట్‌తో పైకి వచ్చినోన్ని కాదంటూ బెంగాల్ టైగర్‌లో చెప్పిన రవితేజ.. తాజాగా ధమాకాలో.. వెనకున్న వాళ్లను చూసుకుని ముందుకొచ్చిన వాన్ని కాదురోయ్.. వెనకెవ్వడూ లేకపోయినా ముందుకు రావొచ్చనే ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడినన్నారు. బెంగాల్ టైగర్‌లో సపోర్ట్‌తో రాలేదన్నారు.. క్రాక్‌ సినిమాలో బ్యాగ్రౌండ్.. రామారావులో లక్కుతో పైకి రాలేదు.. తాజాగా వెనకున్న వాళ్లను చూసి రాలేదు.. ఇవన్నీ ఆయా సందర్భాల్లో వచ్చే డైలాగులే అయినా.. తగలాల్సిన వాళ్ళకు ఎక్కడో తగులుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..