బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్, ప్రముఖ నటుడు వీజే సన్నీ తన కలను సాకారం చేసుకున్నాడు. హౌజ్ లో చెప్పినట్లుగానే ద బార్బర్ క్లబ్ (టీబీస్) సెలూన్ ఫ్రాంచైజీని హైదరా బాద్ లో ప్రారంభించాడు. ఆదివారం (జులై 14)న
మాదాపూర్ లో ఈ సెలూన్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ద బార్బర్ క్లబ్ సెలూన్‌ను ప్రవేశపెట్టిన జోర్డాన్ కూడా వీజే సన్నీ ఫ్రాంచైజీ ఓపెనింగ్‌కు విచ్చేశాడు. ఈ సందర్భంగా అతనికి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, తరుణ్ కూడా హాజరయ్యారు అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీలు మానస్, సొహైల్, ఆర్జే కాజల్, దీప్తి సునయన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీజే సన్నీతో కలిసి అందరూ ఫొటోలు దిగారు. అలాగే అతనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వీజే సన్నీ. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సెలూన్ తెరిచి ఉంటుందని పేర్కొన్నాడు.
ప్రస్తుతం వీజే సన్నీ సెలూన్ ఓపెనింగ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు వీజే సన్నీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ‘బిగ్ బాస్ హౌజ్ లో నువ్వు చెప్పిన కలను సాధించుకున్నావు.. నువ్వింకా ఎన్నో మైలు రాళ్లను అందుకోవాలి’ అంటూ విషెస్ చెబుతున్నారు.
Bigg Boss fame VJ Sunny has entered the beauty salon business. Owner of TBC Luxury Salon and Celebrity hair stylist Jordan Tabakman opned in Madhapur, Hyderabad.#vjsunny #TbcLuxurySalons #AmpleReach #hebarberclub #beautySalon #Hyderabadd #unisexsalon #hairstyle #amplereachpr pic.twitter.com/ePatHBfK0T
— Ample Reach PR (@amplereachpr) July 14, 2024
కాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించాడు వీజే సన్నీ. ఆ తర్వాత నటుడిగా మారాడు. కల్యాణ వైభోగమే సీరియల్ లో సన్నీపోషించిన పాత్రకు చాలా మంచి పేరొచ్చింది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. తన ఆటతీరు, మాటతీరు తో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకోవడంతో బిగ్ బాస టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సకల గుణాభిరామ, అన్ స్టాపబుల్, సౌండ్ పార్టీ సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే వీజే సన్నీ నటించిన ఏటీఎమ్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.