AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి బరాత్‌లో స్టార్ హీరో నాగిని డ్యాన్స్.. నేలపై దొర్లుతూ.. వీడియో

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి వచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. నూతన వధూవరులను అశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన బరాత్‌లో బాలీవుడ్ స్టార్ హీరో,

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి బరాత్‌లో స్టార్ హీరో నాగిని డ్యాన్స్.. నేలపై దొర్లుతూ.. వీడియో
Anant Ambani Wedding
Basha Shek
|

Updated on: Jul 15, 2024 | 7:48 AM

Share

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న తనయుడు అనంత్ అంబానీ పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ జులై 12 వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు తరలి వచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు. నూతన వధూవరులను అశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన బరాత్‌లో బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో చలాకీగా ఉండే ఈ హీరో అనంత్ అంబానీ పెళ్లిలోనూ హంగామా చేశాడు. నాగిని డ్యాన్స్ చేస్తూ అతిథులను అలరించాడు. అతనికి తోటి హీరోలు అర్జున్ కపూర్, వీర్ పహారియా కూడా తోడయ్యాడు. అందరూ కలిసి హుషారుగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

కాగా అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ ల వివాహ వేడుకకు భార్య దీపికా పదుకొణెతో కలిసి హజరయ్యాడు రణ్ వీర్ సింగ్. అలాగే ప్రియాంక చోప్రా- నిక్ జొనస్, షారుఖ్ ఖాన్- గౌరీఖాన్, అలియా భట్, రణ్ బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్, ఉపాసన కొణిదెల, అనన్యా పాండే, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, పవన్ కల్యాణ్, అక్కినేని అఖిల్, వెంకటేశ్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, సూర్య, జ్యోతిక, రజనీకాంత్ సహా పలువురు సినిమా తారలు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో తళుక్కుమన్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో సినీ తారల డ్యాన్స్.. వీడియో..

అనంత్ అంబానీ బరాత్ లో రణ్ వీర్ సింగ్ డ్యాన్స్.. వీడియో ఇదిగో..

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ తారల హంగామా.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!