Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 మూడోవారం మరింత రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉన్న వారు పోలీసులు, దొంగలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో గొడవలు, గోలలు, ఏడుపులు మాములుగా లేవు. ఈ టాస్క్ లో మరోసారి ఇనయ గీతూ మధ్య వాగ్వాదం జరిగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో పోలీస్‌లు రైడ్‌కు వెళ్లినప్పుడు దొంగలు వారిని పట్టుకోవచ్చు.. రైడ్ టైం ముగిసిన తరువాత కూడా పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో పోలీస్ అయిన ఇనయ దొంగలకు దొరికేసింది. దాంతో ఆమెని పట్టుకున్నారు. ఈ క్రమంలో తోపులాట గట్టిగానే జరిగింది. వాళ్ళదగ్గర నుంచి విడిపించుకుని క్రమంలో ఇనయ ఆరోహిని కాలుతో తన్నింది. అలాగే నేహాను చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో నేహా బాధపడింది. మరీ అంతలా కొట్టాలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇనయ తన డ్రస్ ను ఎవరిలో లాగేశారు అంటూ ఆరోపించింది. ఇదిలా ఉంటే వీరి మధ్యలో గీతూ ఎంటర్ అయ్యింది. ఇనయ దే తప్పు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ టాస్క్ లో రేవంత్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. తన బొమ్మలను ఎవరో కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గూ శరం లేదంటూ ఊగిపోయాడు. అయితే రేవంత్ బొమ్మలు కొట్టేయాలని నేహా, ఆరోహి ప్లాన్ వేశారు.దాంతో తన టీమ్ తనను మోసం చేసిందని.. రేవంత్ దొంగల టీం మీద మండిపడ్డాడు. పోలీసుల టీంను గెలిపిస్తాను అంటూ రేవంత్ ఆట ఆడాడు. బుధవారం నాటి టాస్క్ ముగిసే సరికి.. శ్రీహాన్, సూర్యల దగ్గరే ఎక్కువ డబ్బులున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..