AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvala Madhuri: బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్రమా? దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్

ఆడవాళ్ల దుస్తుల విషయంపై రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడెప్పుడో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను కొందరు వ్యతరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Divvala Madhuri: బట్టలు విప్పుకొని తిరిగితేనే స్వతంత్రమా? దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్
Divvala Madhuri
Basha Shek
|

Updated on: Mar 29, 2026 | 5:25 PM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది దివ్వెల మాధురి. హౌస్‌లో కేవలం మూడు వారాలు మాత్రమే ఉన్నాతన ఆట తీరు, మాటతీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. ‘ఫైర్ బ్రాండ్’ ట్యాగ్ కు తగ్గట్టుగానే మొదట్లో తోటి కంటెస్టెంట్లతో గొడవలు పడిన ఆమె ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ తనూజతో సహా తోటి కంటెస్టెంట్లందరి తోనూ స్నేహంగా మెలిగింది. కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దివ్వెల మాధురి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. అలా తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఆమె మహిళల వస్త్రధారణ విషయంపై స్పందించింది. ‘అమ్మాయిలకు డ్రెస్సింగ్ విషయంలో లిమిట్స్ ఉండాలి. ఈ విషయంలో నేను శివాజీ గారికి మద్దతు తెలుపుతూ ఒక వీడియో కూడా చేశాను. మనం వేసుకుని దుస్తులను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతున్నాయా? అంటే నేను ఔనని చెప్పను. కానీ మనకంటూ సెక్యూరిటీ ఉండాలి. సౌకర్యంగా లేని బట్టలను వేసుకెళ్లి అందరూ చూస్తుండగా సర్దుకోవడం కంటే నిండుగా దుస్తులు వేసుకొని వెళ్లడం మంచిది. అమ్మాయిలకు అందం అనేది ఎక్స్ పోజింగ్ చేస్తే రాదు. ఒంటిపై నిండుగా బట్టలు వేసుకున్నప్పుడే అమ్మాయిలకు అందం రెట్టింపు అవుతుంది. మనం ఎప్పుడైతే నిండుగా దుస్తులు ధరిస్తామో అప్పుడే మనం బయటకు వెళ్లిన చాలా గౌరవం ఉంటుంది’అని చెప్పుకొచ్చింది.

కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ మనం ఇంట్లో షార్ట్ వేసుకుంటే మన అన్నకు, నాన్నకు అలాంటి ఫీలింగ్స్ రావు కదా’ కామెంట్స్ చేసింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అన్న యాంకర్ ప్రశ్నకు దివ్వెల మాధురి ఇలా స్పందించింది. ‘ ఈ మధ్యకాలంలో ఎన్ని సందర్భాలలో మనం కూతురిపై తండ్రి లైంగిక దాడి, అన్న వల్ల గర్భవతి అయిన చెల్లెలు అనే వార్తలు వినలేదు. అలాంటి ఫీలింగ్స్ రానప్పుడు ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి. బట్టలు విప్పి తిరిగితేనే స్వతంత్రం అనుకోవడం చాలా తప్పు. అమ్మాయిలు మీరు ఇండిపెండెంట్ గా ఎదిగితేనే మీకు స్వతంత్రం వచ్చినట్టు’ అంటూ ఆన్సరిచ్చింది దివ్వెల మాధురి. ప్రస్తుతం ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

దివ్వెల మాధురి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us