Bigg Boss Telugu 8: పిల్లల్ని చంపేస్తారా..! గుడ్లు కోసం కొట్టుకున్నంత పని చేసిన హౌస్ మేట్స్..

|

Sep 18, 2024 | 6:13 PM

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రభావతి 2.ఓ  అని ఓ పెద్ద కోడి పుంజు బొమ్మను హౌస్ లో ఉంచారు . దాని నుంచి వచ్చే గుడ్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ గుడ్లను నాకు తిరిగి ఇస్తారో వారికి నా తరుపున కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అని ఓ వాయిస్ వినిపించింది.

Bigg Boss Telugu 8: పిల్లల్ని చంపేస్తారా..! గుడ్లు కోసం కొట్టుకున్నంత పని చేసిన హౌస్ మేట్స్..
Bigg Boss8
Follow us on

బిగ్ బాస్ సీజన్ 8 రచ్చ రచ్చగా సాగుతోంది. చిత్ర విచిత్రమైన టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు క్రేజీ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ప్రభావతి 2.ఓ  అని ఓ పెద్ద కోడి పుంజు బొమ్మను హౌస్ లో ఉంచారు . దాని నుంచి వచ్చే గుడ్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ క్లాన్ సభ్యులైతే ఎక్కువ గుడ్లను నాకు తిరిగి ఇస్తారో వారికి నా తరుపున కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అని ఓ వాయిస్ వినిపించింది. దాంతో హౌస్ మేట్స్ గుడ్ల కోసం రెచ్చిపోయారు. ముందుగా కోడి నుంచి గుడ్లను తెచ్చుకునేందుకు పోటీ పడ్డారు హౌస్ మేట్స్.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆ తర్వాత ఒకరి దగ్గర నుంచి మరొకరు కొట్టేయడాని ప్రయత్నించారు. ఈ క్రమంలో కొట్టుకున్నంత పని చేశారు. ఇక ఈ క్రమంలో ఆదిత్య ఓంను పృథ్వీ ఎత్తి పక్కకు విసిరేశాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. తన మెడను గట్టిగా పట్టుకున్నాడు అని ఆదిత్య ఓం పృథ్వీతో చెప్పుకున్నాడు. కానీ దానికి నన్ను ఇద్దరు పట్టుకున్నారు అంటూ పృథ్వీ చెప్పుకొచ్చాడు. ఆతర్వాత మణికంఠను కూడా పృథ్వీ పక్కకు విసిరేశాడు. నా మెడను విరిచేసేంత పని చేశాడు అని ఆదిత్య చెప్తుంటే నా క్లాన్ దగ్గరకు రావొద్దు అంటూ విష్ణు ప్రియా, మిగిలిన వారు గట్టిగా అరిచారు.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

ఆతర్వాత పృథ్వీ కూడా రెచ్చిపోయి అరిచాడు. దాంతో యష్మి అసలు టాస్క్ పెట్టొద్దని చెప్పండి బిగ్ బాస్ కి  అక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది అని ఎందుకు అని మాట్లాడింది. దానికి ఎవరో ఎదో అంటే నేను ఆడుతున్న కదా.. నేను అమ్మాయినే కదా అని గట్టిగా అరుస్తూ సమాధానం ఇచ్చింది యష్మి. మొత్తానికి గుడ్ల కోసం గట్టిగానే కొట్టుకున్నారు హౌస్ మేట్స్. మరి ఈ రోజు ఈ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.