Bigg Boss 7 Telugu: అమర్ అశ్విని మధ్య గొడవ.. లాఠీ విసిరేసి గట్టిగా అరుస్తూ..

శివాజీని మేనేజర్ గా.. ప్రశాంత్ పనోడుగా, రతిక డ్రైవర్ గా, అశ్విని, శోభా శెట్టి న్యూస్ యాంకర్స్ గా నటించాలని చెప్పాడు. అర్జున్ , అమర్ మడ్డర్ ఎవరు చేశారన్నదాని పై ఎంక్వేరి చేయాలనీ చెప్పాడు. దాంతో అమర్, అర్జున్ తనదైన స్టైల్ లో కామెడీ చేసి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కు, శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

Bigg Boss 7 Telugu: అమర్ అశ్విని మధ్య గొడవ.. లాఠీ విసిరేసి గట్టిగా అరుస్తూ..
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 22, 2023 | 4:35 PM

హౌస్ లో ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో ఓ మడ్డర్ జరిగిందని దాన్ని అమర్, అర్జున్ ఇన్ వెస్టిగేషన్ చేయాలనీ చెప్పాడు. ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న మెంబర్స్ కు ఒకొక్క క్యారెక్టర్ ఇచ్చాడు బిగ్ బాస్. శివాజీని మేనేజర్ గా.. ప్రశాంత్ పనోడుగా, రతిక డ్రైవర్ గా, అశ్విని, శోభా శెట్టి న్యూస్ యాంకర్స్ గా నటించాలని చెప్పాడు. అర్జున్ , అమర్ మడ్డర్ ఎవరు చేశారన్నదాని పై ఎంక్వేరి చేయాలనీ చెప్పాడు. దాంతో అమర్, అర్జున్ తనదైన స్టైల్ లో కామెడీ చేసి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ కు, శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అర్జున్, అమర్ హౌస్ లో ఉన్న వారిని ఎంక్వేరి చేశారు. ఈ క్రమంలో ముందుగా ప్రియాంకను విచారించారు అర్జున్, అమర్.

ఆ తర్వాత రతికాను విచారించారు. హైదరాబాద్ నుంచి మీ ఊరు ఎంత దూరం అని అడిగితే.. మా ఊరు నుంచి హైదరాబాద్ కు ఎంత దూరమో అంత దూరం అని సమాధనం చెప్పింది రతిక. ఈ ముగ్గురి మధ్య ఆసక్తిగా టాక్ నడిచింది. ఆతర్వాత నేను చెప్పే వరకు నువ్వు బయటకు రావద్దు అంటూ ప్రశాంత్ ను స్టోర్ రూమ్ లోకి పంపించాడు శివాజీ.

ప్రశాంత్ స్టోర్ రూమ్ లోనే ఉండిపోయాడు. దాంతో అమర్, అర్జున్ ప్రశాంత్ ఎక్కడ అంటూ వెతికారు. ఆ తర్వాత శోభా శెట్టికి అమర్ కు మధ్య గొడవ జరిగింది. నువ్ చేస్తుంది నాకు నచ్చడం లేదు అమర్ అని శోభా అనడంతో అమర్ సీరియస్ అయ్యాడు. తన చేతిలో ఉన్న లాఠీని విసిరి కొట్టి.. ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని.. నేను ఆపానా మిమ్మల్ని అంటూ గట్టిగా అరిచాడు. దానికి మధ్యలో అశ్విని దూరి నన్ను చూసి చెప్పకు నేను నిన్ను ఏమి అనలేదు అని అంది. దాంతో గొడవ అశ్విని వైపు తిరిగింది. దాంతో అశ్విని వాయిస్ పెంచి గట్టిగా మాట్లాడింది. అమర్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా వాదనకు దిగాడు. నీకన్నా గట్టిగా మాట్లాడగలను అని అమర్ అంటే నేను నీకన్న గట్టిగా మాట్లాడగలను అంటూ అరిచి రాద్ధాంతం చేసింది అశ్విని. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా ఉండనుందని అర్ధమవుతుంది.