Jawan : ఓటీటీలోనూ షారుక్ ఖాన్ కింగే.. రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జవాన్..
సెప్టెంబర్‌లో విడుదలైన ‘ జవాన్ ’ సినిమా కూడా భారీ విజయం అందుకుంది. జవాన్ సినిమా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాలు మల్టీప్లెక్స్‌లకే కాదు OTTకి కూడా తానే కింగ్ అని నిరూపించుకున్నాడు. షారుక్ నటించిన 'జవాన్' నెట్‌ఫ్లిక్స్ OTT లో అత్యధిక వీక్షణలను పొందింది.
నటుడు షారూఖ్ ఖాన్‌కు 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఏడాది ప్రారంభంలో ‘పఠాన్’ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ ను రాబట్టింది. సెప్టెంబర్‌లో విడుదలైన ‘ జవాన్ ’ సినిమా కూడా భారీ విజయం అందుకుంది. జవాన్ సినిమా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. షారుఖ్ ఖాన్ ఇప్పుడు సినిమాలు మల్టీప్లెక్స్‌లకే కాదు OTTకి కూడా తానే కింగ్ అని నిరూపించుకున్నాడు. షారుక్ నటించిన ‘జవాన్’ నెట్‌ఫ్లిక్స్ OTT లో అత్యధిక వీక్షణలను పొందింది.
సెప్టెంబర్ 7న ‘జవాన్’ సినిమా థియేటర్లలో విడుదలైంది. తర్వాత, షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం నవంబర్ 2 న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా రికార్డు సృష్టించింది. రెండు వారాల్లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ‘జవాన్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వార్తను నెట్‌ఫ్లిక్స్ స్వయంగా షేర్ చేసింది. షారుఖ్ ఖాన్ స్టామినాకు నిదర్శనం.
ఓటీటీలో తన సినిమాపై ఆడియన్స్ ఇంత ప్రేమను కనబరుస్తున్నందుకు షారూఖ్ సంతోషం వ్యక్తం చేశాడు. అందుకు తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదలైన ‘జవాన్’ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారూఖ్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి నటించారు.
‘జవాన్’, ‘పఠాన్’ సినిమాల సక్సెస్‌తో షారుఖ్‌కి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ‘డంకీ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు కింగ్ ఖాన్. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. డంకి టీజర్ ఇప్పటికే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. పాటల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్ తో పాటు, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను తదితరులు కూడా నటించారు.
Vikram Rathore has hijacked our hearts and records! ❤️🔥 📈 Jawan is now the most watched film in India in the first 2 weeks of launch, across all languages, on Netflix!
Watch Jawan in Hindi, Tamil and Telugu, now streaming on Netflix#JawanOnNetflix @iamsrk @Atlee_dir… pic.twitter.com/0uRkbFhr0t
— Netflix India (@NetflixIndia) November 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.