Rajinikanth: రజినీకాంత్‌తో కలిసి నటించడం పై క్లారిటీ ఇచ్చిన మమ్ముట్టి.. ఏమన్నారంటే

విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లోకేష్. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు కూడా.. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలిసి 'తలైవర్ 171' చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

Rajinikanth: రజినీకాంత్‌తో కలిసి నటించడం పై క్లారిటీ ఇచ్చిన మమ్ముట్టి.. ఏమన్నారంటే
Rajinikanth, Mammootty
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 22, 2023 | 4:53 PM

తమిళ్లో ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న లోకేష్. రీసెంట్ గా లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయనున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు కూడా.. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలిసి ‘తలైవర్ 171’ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

దీంతో పాటు ఈ సినిమాపై పలు రూమర్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కూడా నటిస్తారని  ప్రచారం జరుగుతుంది. చాలా రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. తాజాగా దీని పై మమ్ముట్టి స్పందించారు.

జైలర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్.   ‘లియో’ సినిమాతో లోకేష్ కనగరాజ్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. లియో సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఇప్పుడు లోకేష్ భారీ సక్సెస్ సాధించాలని కసి మీద ఉన్నాడు.  ఈక్రమంలో’తలైవర్ 171′ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సూపర్ స్టార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మమ్ముట్టి నటిస్తారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ‘కాదల్ ది కోర్’ సినిమా ప్రమోషన్‌లో మమ్ముట్టి, జ్యోతిక పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో రజనీకాంత్ 171వ సినిమా గురించి మమ్మూటీకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. ‘లోకేశ్ కనగరాజ్ సినిమా సినిమాలో మీరు భాగమవుతారా.? అని ప్రశ్నించగా.. నాకు మలయాళ సినిమా చాలు. ఈ విషయం నాకు తెలియదు. లోకేష్ పిలవనివ్వండి, అప్పుడు చూద్దాం’ అని మమ్ముట్టి అన్నారు. దీంతో అన్ని రూమర్లకు తెర పడింది. మరోవైపు రజనీకాంత్‌ సినిమా టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ