AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. కంటెస్టెంట్ల సమక్షంలో శివ్, ప్రియాంక నిశ్చితార్థం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ హౌస్ లోకి వస్తున్నారు. తమ వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ధైర్యంగా ఉండాలని, బిగ్ బాస్ కప్పుతో తిరిగి రావాలని చెబుతున్నారు.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. కంటెస్టెంట్ల సమక్షంలో శివ్, ప్రియాంక నిశ్చితార్థం
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 5:59 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, హోరా హోరీగా సాగుతోంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పదో వారం కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా.. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్నారు. తమ వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ధైర్యంగా ఉండాలని, బిగ్ బాస్ కప్పుతో తిరిగి రావాలని చెబుతున్నారు. జబర్దస్త్ నరేష్ , శ్వేతా నాయుడు, టెంపర్ వంశీ , ముఖేష్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. ఇక శివ్ కుమార్ ప్రియురాలు ప్రియాంక జైన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ వేదికగా, కంటెస్టెంట్ల సమక్షంలో శివ్- ప్రియాంక నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందులో భాగంగానే శివ్ కోసం ప్రత్యేకంగా బట్టలు కూడా తీసుకొచ్చింది ప్రియాంక. ఆ తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పైగా కొత్త పెళ్లికూతురు, పెళ్లి కొడుకు ఇంట్లోకి అడుగు పెట్టే సీన్లను వీళ్ళు ఇక్కడ రీ క్రియేట్ చేశారు. మొత్తానికి కాబోయే నూతన దంపతులం అంటూ సాగిన ఈ నిశ్చితార్థ వేడుక ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బిగ్ బాస్ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే ప్రియాంక జైన్ కూడా గతంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. అప్పుడు శివ్ కుమార్ హౌస్ లోకి వచ్చి ప్రియాంకను సర్ ప్రైజ్ చేశాడు. ఇప్పుడు శివ్ కుమార్ హౌస్ లో ఉండగా ప్రియాంక వచ్చి అతనికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాగా వీరు చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే పెళ్లి మాత్రం చేసుకోలేదు. బిగ్ బాస్ షో కు ముందు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి కూడా వెళ్లారీ లవ్ బర్డ్స్. అక్కడ పెళ్లి టాపిక్ తీసుకురావడంతో త్వరలోనే చేసుకుంటామని చెప్పారు. కానీ అధికారికంగా ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన ప్రియాంక.. నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి శివ్ కుమార్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక వీరి పెళ్లి జరుగుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us