AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా

బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్టులు వారానికి రెండు సార్లు మాత్రమే కనిపిస్తుంటారు. అది కూడా వీకెండ్ లో మాత్రమే. మరి అలాంటి హోస్ట్ లకు రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి? ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటోన్న హోస్ట్ ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం రండి.

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 07, 2026 | 8:02 PM

Share

బిగ్ బాస్.. భారతీయ టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత అన్ని ప్రధాన భాషల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా బిగ్ బాస్ రియాలిటీ షో విషయానికి వస్తే హోస్ట్ లు కేవలం వీకెండ్ లోనే కనిపిస్తారు. అయినా ఈ రియాలిటీ షోకు వారే వెన్నెముక అని చెప్పవచ్చు. హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే తప్పొప్పులను ఎప్పటికప్పుడూ వారికి తెలియజేస్తూ షోను రక్తికట్టిస్తుంటారు హోస్ట్ లు. అవసరమైతే కంటెస్టెంట్లకు కఠిన శిక్షలు కూడా వేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, బెంగాలీలో సౌరవ్ గంగూలీ బిగ్ బాస్ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఆదివారం (సెప్టెంబర్ 06) నుంచి బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హోస్టుల రెమ్యునరేషన్ మరోసారి తెర మీదకు వచ్చింది. వారి రెమ్యునరేషన్లు ఎలా ఉంటాయి? ఏ హోస్ట్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్నదానిపై చర్చ జరుగుతోంది.

కాగా రెమ్యునరేషన్ విసయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడట. ఆ తర్వాత తమిళ స్టార్ విజయ్ సేతుపతి, మూడో ప్లేసులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఉన్నారట. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్ ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా తీసుకుంటున్నారని, ఓవరాల్ గా ఒక సీజన్ కు రూ.125 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఇక తమిళ బిగ్‌బాస్‌ కోసం విజయ్ సేతుపతి సుమారు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న బిగ్ బాస్ హోస్ట్ మక్కల్ సెల్వనే అని తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు షో కోసం నాగార్జున రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారట.

ఇక మలయాళం బిగ్ బాస్ షో కోసం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సుమారు రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. అలాగే కన్నడ బిగ్‌బాస్ హోస్టింగ్ కోసం కిచ్చా సుదీప్ సుమారు రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈసారి మొదటి సారిగా బిగ్ బాస్ బెంగాళీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తన్నారు. ఆయనకు సంబంధించిన డీల్ విలువ కూడా భారీగానే ఉందని సమాచారం. నాలుగేళ్ల ఒప్పందానికి సుమారు రూ.125 కోట్ల వరకు డీల్ కుదిరినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us