Bigg Boss Telugu 10: ఇదేం ట్విస్ట్.. బిగ్‌బాస్ 10లోకి టాలీవుడ్ ఫేమస్ హీరో.. భారీ రెమ్యూనరేషన్‌తో ఎంట్రీ ఫిక్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి టాలీవుడ్ కు చెందిన ఒక ఫేమస్ హీరో రానున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ ట్యాలెంటెడ్ నటుడికి బిగ్ బాస్ ఎంట్రీ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ఇంతకీ అతనెవరంటే?

బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ గ్రాండ్ లాంఛింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్ లోకి కామనర్స్ ఎంపిక కోసం నిర్వహిస్తోన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 దాదాపు తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఓవైపు బిగ్ బాస్ షో కోసం అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూనే మరోవైపు ఈసారి హౌస్ లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో పేరు చేరింది. అది కూడా ఎవరూ ఊహించని సెలబ్రిటీ.
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోగా, సెకెండ్ హీరోగా రాణిస్తోన్న అదిత్ అరుణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగు పెట్టడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ‘కథలో రాజకుమారి’, ‘తుంగభద్ర’, ‘పిఎస్‌వి గరుడ వేగ’, ‘డియర్ మేఘ’, ‘ప్రేమదేశం’, ‘లైన్ మ్యాన్’, ‘జిగేల్’, ‘ఈషా’, ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు అదిత్ అరుణ్. ఇక రీసెంట్ సూపర్ హిట్ సినిమా చెన్నై లవ్ స్టోరీలోనూ సెకెండ్ హీరోగా చేశాడు అదిత్. ప్రస్తుతం యూత్ లో ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. ఈ విషయంపై ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు అదిత్ అరుణ్ ను సంప్రదించారని టాక్. అయితే ఈ టాలీవుడ్ హీరో వైపు నుంచి ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. ఒక వేళ అరుణ్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తే షోకు ఆదరణ పెరుగుతుందని రియాలిటీ షో నిర్వాహకులు భావిస్తున్నారు. మరి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న అదిత్ అరుణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వస్తాడా? రాడా? అన్నది తెలియాలంటే గ్రాండ్ లాంఛింగ్ వరకు ఎదురు చూడాల్సిందే.
చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




