AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ 10లో టాలీవుడ్ స్టార్ విలన్.. కన్ఫర్మ్ లిస్టులో పేరు ఉందట

'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10కు సంబంధించి అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారని సమాచారం. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల కన్ఫర్మ్ లిస్టులో ఈ టాలీవుడ్ ఫేమస్ విలన్ కూడా ఉన్నారని టాక్.

Bigg Boss Telugu 10: ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ 10లో టాలీవుడ్ స్టార్ విలన్.. కన్ఫర్మ్ లిస్టులో పేరు ఉందట
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 22, 2026 | 1:06 PM

Share

బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే కొందరు పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో టాలీవుడ్ కు చెందిన ఫేమస్ విలన్ కూడా ఉన్నారని సమచారం. అతను మరెవరో కాదు టెంపర్ వంశీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. ‘టెంపర్’ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. ‘అత్తారింటికి దారేది’, ‘భరత్ అనే నేను’, ‘సాహో’, ‘భీష్మ’, ‘వకీల్ సాబ్’, ‘హిట్ 2’, ‘దేవర’.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’లోనూ వంశీ నటించాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వంశీ కన్ఫర్మ్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా చేసిన వ్యక్తి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు? బిగ్ బాస్ లో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ఛర్మిల కూడా బిగ్ బాస్ 10లోకి వస్తుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను యాంకరమ్మ ఖండించింది. కాగా ఈసారి సెలబ్రిటీ కంటెస్టెట్ల జాబితాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, చంద్రహాస్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, హీరో అబ్బాస్ వంటి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు
వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..?
వామ్మో.. గంటల తరబడి రీల్స్, షార్ట్స్ చూస్తున్నారా..?
పారిస్‌లో త్వరలో BAPS ఆలయం ప్రారంభోత్సవం
పారిస్‌లో త్వరలో BAPS ఆలయం ప్రారంభోత్సవం
మీ బంగారాన్ని ఇతరులకు అమ్మితే ట్యాక్స్ కట్టాలా..?
మీ బంగారాన్ని ఇతరులకు అమ్మితే ట్యాక్స్ కట్టాలా..?